Feb 22,2023 15:14

ప్రజాశక్తి - రెడ్డిగూడెం : రెడ్డిగూడెం మండలంలోని మద్దులపర్వలో బుధవారం రెండో రోజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కొనసాగింది. అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులతో ఎమ్మెల్యే కృష్ణప్రసాదు  కాసేపు సరదగా గడిపారు. చిన్నారుల ప్రతిజ్ఞను ఆసక్తిగా తిలకించారు. ఓ  దివ్యాంగుని విజ్ఞప్తి మేరకు అతనికి ట్రై సైకిల్ ఇస్తామని హామీనిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు  మీడియాతో మాట్లాడుతూ అర్హత ఉండి సంక్షేమ పథకాలు రాలేదు అని చెప్పిన వారు ఎవరూ లేరన్నారు. ఇదే సీఎం జగన్మోహన్ రెడ్డి  పరిపాలనా విధానానికి నిదర్శనమన్నారు. కుల,మత, వర్గ రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేయడం పట్ల స్థానిక ప్రజలు జగనన్నకు జేజేలు పలుకుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు పాలంకి విజయ భాస్కర్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బలగాని తిరుపతిరావు, అధికారులు, ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.