Dec 31,2022 15:33

ప్రజాశక్తి-పెడబయలు (అల్లురి జిల్లా)  : మండలంలో కుంతుర్ల పంచాయతీకి చెందిన బొర్రా మామిడి గ్రామస్తుడు పూజారి కొండబాబు 35 గత ఐదు నెలలుగా అదృశ్యమై  కనబడుట లేదని అతని ఆచూకీ కోసం  గాలింపు చర్యలు చేపట్టిన అతని ఆచూకీ తెలియడం లేదని స్థానిక ఎస్ ఐ పులి మనోజ్ కుమార్ శనివారం విలేఖరులకు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి ఈ సంవత్సరం జూలై నెలలో తోటి స్నేహితులతో కలసి ఉపాధి కూలి పనులకు విజయవాడ వెళ్లారని విజయవాడ రైల్వే స్టేషన్ లో  దిగిన తరువాతా ఎంత సేపటికీ కొండబాబు  కనిపించక పోవడం తొ,తప్పి పోయినట్లు గమనించిన స్నేహితులు కొండబాబు కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వార తెలియ పరిచారని  దీని మేరకు కొండబాబు భార్య శాంతి ఇచ్చిన పిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నేటికీ అతని ఆచూకీ తెలియకుండా పోయిందని ఎవరికైన కొండబాబు కనిపిస్తే  సెల్ నంబర్ 9440904227 సమాచారం అందించాలని పత్రిక ప్రకటన ద్వారా  స్థానిక ఎస్ ఐ పులి మనోజ్ కుమార్ తెలిపారు