Oct 13,2023 11:15
  • స్వచ్ఛత మన బాధ్యత కార్యక్రమంలో  మంత్రి వేణు

ప్రజాశక్తి-రామచంద్రపురం : ప్రజలంతా పరిశుభ్రతపై అవగాహన కలిగి ఉండాలని పరిసరాల స్వచ్ఛత ఎంతో అవసరమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. ఆయన శుక్రవారం ఉదయం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లారామచంద్రపురం  పురపాలక సంఘం పరిధిలో ఏర్పాటుచేసిన స్వచ్ఛత మన బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగామున్సిపల్ కార్యాలయంఎదురుగా గల మహాత్మా గాంధీ విగ్రహాన్ని మంత్రి స్వయంగా శుభ్రపరిచారు. స్వచ్ఛ రామచంద్రపురం పేరుతో పరిసరాలన్నీ పరిశుభ్రంగాఉంచేందుకు మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన డస్ట్ బిన్ లను ట్రాలీలను ఆయన స్వచ్ఛత మన బాధ్యత అనే నినాదంతో ముందుకు నడిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశుభ్రంగా ఉండేందుకు ఆని చర్యలు చేపట్టామని పేరుకుపోయిన చెత్తను, సిల్ట్ ను ఎప్పటికప్పుడు తొలగించేందుకు ట్రావెల్ తో సహా డస్ట్ బిన్ లను ఏర్పాటు చేయటం వల్ల ఉపయోగం ఉంటుందని ఉదయం 6 గంటలకే మున్సిపల్ సిబ్బంది పారిశుధ్యం పనులను పరిశీలించామన్నారు. స్వచ్ఛత మనందరి బాధ్యత అని దానిని ప్రతి ఒక్కరూ పాటించాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి, వైసిపి నాయకులు గాదంశెట్టి శ్రీధర్, కౌన్సిలర్లు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.