Mar 26,2023 16:32

ప్రజాశక్తి - పుత్తూరు టౌన్ :‌ విలువలతో కూడిన విద్యతోనే విద్యార్థులకు సార్థకత చేకూర్తుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రి ఆర్.కె.రోజా అన్నారు. విద్యాదానంతో విద్యార్ధితో పాటు కుటుంబం కూడా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. పుత్తూరు పట్టణంలోని స్థానిక జ్ఞాన జ్యోతి విద్యా మందిర్ పాఠశాలలో వార్షికోత్సవ సమావేశము నిర్వహించారు ఎందుకు ముఖ్యఅతిథిగా మంత్రి ఆర్కే రోజాను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు నైతిక విలువలు కూడా అలవరచుకోవాలని కోరారు. మన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల సంక్షేమం కోసం చేస్తున్న కృషికి విద్యార్థులు బాగా చదివి మంచి స్థాయిలో స్థిరపడి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని కోరారు. జ్ఞానజ్యోతి కరెస్పాండంట్ ప్రకాష్ సేవలను  ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో డి.ఇ.ఓ శేఖర్, ప్రిన్సిపాల్ హరినాథ్ రెడ్డి, మునిసిపల్ చైర్మన్, ఏ హరి. వైస్ చైర్మన్లు, డీ జయప్రకాష్. నిండ్ర ఎంపీపీ, కౌన్సిలర్లు వనిత కార్తికేయన్, ఎంపీటీసీలు, స్టేట్ డైరెక్టర్, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, జ్ఞానజ్యోతి హైస్కూల్ టీచర్స్ పాల్గొన్నారు.