Oct 09,2022 16:35

ప్రజాశక్తి-పెదబయలు : విభజన చట్టంలో హామీలకై వైసిపి ఎంపీలు రాజీనామా చేసే దమ్ముందా అని మాజీ మంత్రి అరకు నియోజకవర్గం ఇంచార్జి కిసారి శ్రవణ్ కుమార్ శనివారం విలకారులతో అన్నారు. అనంతరం అయన మాట్లాడుతూ రాష్ట్ర వైసిపి ప్రభుత్వం ఎమ్మెల్యేలు రాజీనామా డ్రామాలు అపాలని వైసిపి ప్రభుత్వంపై వస్తున్నా ప్రజా వ్యతిరేకతను దారి మల్లించడానికి రాజీనామా డ్రామాలు ఆడుతున్నారన్నారు. రాజీనామాల ద్వారా రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు. రాష్ట్ర వైసిపి ప్రభుత్వంనికి చిత్తశుద్ధి ఉంటే 2019 ఎన్నికల్లో కూడా కేంద్ర ప్రభుత్వానికి మెడలు వంచి ప్రత్యేక హోదా రైల్వే జోన్ తెస్తామన్నారు. ఇప్పటి వరకు ఏం సాధించారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకోసం రాష్ట్ర ఎంపిల చేత రాజీనామాలు చేసే దమ్ముందా అని వైసిపికు కుడారి శ్రవణ్ కుమార్ సూటిగా ప్రశ్నించారు.రాష్ట్ర విభజన హామీలు ఏమయ్యాయని రాష్ట్రంలో అత్యధికముగా ఎంపీలు వైసిపి ప్రజలు ఇచ్చారాని ఒక్క ఎంపీ కూడా విభజన హామీలకోసం పార్లమెంట్ లో ప్రస్తావన తేలేక పోవడం వెనకాల పెద్ద మతాలబు ఉందన్నారు. ఈకార్యక్రమంలో భాగంగా దారెలా సర్పంచ్ పాంగి పాండురంగ స్వామి, మాజీ సర్పంచ్ టి త్రినాద్, ఎస్టీ సెల్ ఆర్గనైజేషన్ కార్యదర్శి సాగర సుబ్బరావు, మాజీ ఎంపీటీసీ కటారి బలం, నాయుడు,  టి డి పి కార్యకర్తలు, అత్యధికంగా పాల్గొన్నారు.