ప్రజాశక్తి-గణపవరం : లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గ్రామాల్లో ఏర్పాటు చేసే ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు వినియోగించుకోవాలని లైన్స్ క్లబ్ మాజీ గవర్నర్ ఈ పూరి సత్యనారాయణ అన్నారు. శుక్రవారం గణపురం లయన్స్ ఆధ్వర్యంలో స్థానిక కన్యకా పరమేశ్వరి వర్తక సంఘ భవనంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. శిబిరంలో ఆశ్రమ ఆస్పత్రి ఆసుపత్రి డాక్టర్లు రోగులకు సేవలందించారు. శిబిరంలో గుండె ఎముకలు కంటి పరీక్షలు షుగరు వ్యాధి పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా అందజేశారు. 100 మంది రోగులకు డాక్టర్లు సేవలందించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సిహెచ్ రవికుమార్ కాకర్ల వినాయక సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.










