ప్రజాశక్తి- పిచ్చాటూరు : శుక్రవారం ఉదయం పిచ్చాటూరు మండలంలోని పాత శివగిరి పంచాయతీలో పశుసంవర్ధక శాఖ డా. మంజుల అధ్వర్యంలో పశువులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 12 దూడలకు నట్టి నివారణ , 8 పశువులకు గర్భకోశ చికిత్సలు, 20 పశువులకు సాధారణ చికిత్స, 90 పశువులకు బ్యుటాక్స్ స్ప్రే చేశారు. ఈ సంధర్బంగా డా.మంజుల మాట్లాడుతూ పశు సంపద బాగుంటే పాడి పరిశ్రమ బాగుంటుందని అన్నారు. అనంతరం లంపి చర్మ వ్యాధి లక్షణాలు, చికిత్స, నివారణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్థక సహాయకులు కే.విజయ్ కుమార్,నాగేంద్ర , వాలంటీర్లు పాల్గొన్నారు










