అమరావతి: మండల కేంద్రమైన అమరావతిలోని మ్యూజియం, తాడేపల్లి వద్ద ఉండవల్లి గుహలను కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయమంత్రి మీనాక్షి లేఖి ఆదివారం సందర్శించారు. మ్యూజియంలోని శాతవాహనుల కాలపు కళాఖండాలను, అమరావతి శిల్ప సాంప్రదాయాలను గురించి మంత్రికి ఆర్కియాలజిస్ట్ కమల్ హాసన్ వివరించారు. మ్యూజియం లోని పాలరాతి శిల్పాలను, ఏకశిలా నంది విగ్రహము, అమరావతి స్తూపము, ప్రాకారం నమూనాలను చూశారు. మంత్రి వెంట అమరావతి సర్కిల్ డిఇ వీరాంజనేయులు, ఎఇలు భానుప్రకాష్‌వర్మ, దేవేంద్ర భోయి, మొహద్, సిఎ నాగేంద్ర, రాజు, గార్డెన్ ఇన్‌ఛార్జి నరేష్, మ్యూజియం సిబ్బంది చిన్నబాబు, శ్రీకాంత్ పాల్గొన్నారు.










