Aug 06,2021 08:27

యాంగాన్‌ : మయన్మార్‌లోని అటవీ ప్రాంతాల్లో సుమారు 40 మృతదేహాలు బయటపడ్డాయి. దేశంలోని మధ్య ప్రాంతంలో ఇవి వెలుగుచూశాయి. సాగింగ్‌ ప్రాంతంలోని కని అనే పట్టణంలోని పలు చోట్ల ఇవి కనిపించాయి. సైన్యం, సైనిక పాలనకు వ్యతిరేకంగా ఏర్పడ్డ మిలీషియా గ్రూపుల మధ్య జరుగుతున్న పోరులో వీరంతా మరణించి ఉంటారని తెలుస్తోంది. ఈ మృతదేహాలను స్థానికులు గుర్తించారు. ఇందులో అనేక మృతదేహాలు చిత్ర హింసలకు గురైనట్లు కనిపిస్తోందని మిలీషియా సభ్యులు, మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఫిబ్రవరి 1న మయాన్మార్‌లోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసిన జుంటా ఆర్మీ... అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. అప్పటి నుండి ఆర్మీపై వ్యతిరేకంగా ఆందోళనలను చేపట్టిన వారిని పిట్టల్లా కాల్చి పారేస్తుంది.