Apr 04,2021 10:31

కావాల్సిన పదార్థాలు : చల్లని పాలు - 4 కప్పులు, మామిడి ముక్కలు - 2 కప్పులు, పంచదార - 1/2 కప్పు, మిరియాల పొడి - టీస్పూను, జీలకర్ర - టీస్పూను, పెరుగు - 1/2 కప్పు, పచ్చిమిర్చి - 1, బాదం పొడి - 2 టీస్పూన్లు, ఉప్పు - టీస్పూను.
తయారుచేసే విధానం : ముందుగా పాలల్లో పంచదార కలిపి కరిగించి బాదం పొడి, ఉప్పు చేర్చాలి. ఇందులో మామిడి ముక్కలు వేసి రెండు నిమిషాలు వెచ్చబెట్టి దింపి పెరుగు చేర్చి తోడుపెట్టాలి. దీన్ని చల్లని 4 కప్పుల్లో సమానంగా వేసుకోవాలి. నాలుగు గంటల తర్వాత గట్టిగా తోడుకుని ఉంటుంది. దీన్ని డీప్‌ ఫ్రిజ్‌లో రెండు గంటలు ఉంచి కప్పుల్లోకి తీసుకుని తినాలి.