అల్లూరి జిల్లా:- హుకుంపేట మండల కేంద్రంలో సీఐటీయూ భవన నిర్మాణ యనియన్ మండల అధ్యక్షులు కాసుల సిద్దేశ్ ఆధ్వర్యంలో కార్మిక ఎర్రజెండా ఎగుర వేసి ఘనంగా ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే జరుపుకున్నారు.మేడే గొప్పతనం పై సిద్దేశ్ మాట్లాడుతూ ..అమెరికా దేశంలో వస్త్ర పరిశ్రమ(టెక్స్ టైల్)కంపెనీల ల్లో పనిచేసే కార్మికులు... చేసే శ్రమశక్తి కు విలువ ఇవ్వాలని,విశ్రాంతి ఉండాలని, రోజుకు 8 గంటల పనీ ఉండాలని ఉదృతంగా, అనేక రోజులు,అనేక రూపాలుగా ఆందోళన సాగించారు.
ఈ నేపథ్యంలో మే 4, 1886 న చికాగో లో కార్మికుల పై పోలీసులు విరుచుకుపడ్డారు. దౌర్జన్యం చేశారు. అయిన వెనకడుగు వేయని కార్మికులు పట్టుదల తో పోరాడి ,8 గంటల పని దినం సాధించారు. ఈ పోరాటంలో పాల్గొన్న 8 మంది కార్మికులను పాలక వర్గం కుట్రపూరితంగా ఉరి తీసింది.ఇది ప్రపంచ కార్మికుల కు తీవ్ర ఆగ్రహావేశాలకు గురి చేసింది. చికాగో కార్మికుల పోరాట స్ఫూర్తి ప్రపంచమంతటా వ్యాపించింది. ఈ నేపథ్యంలో 1889 లో మే 1 అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం గా ప్రకటించారు. మన భారత దేశంలో 1923లో మొదటిసారి మేడే జరిపారు.మన దేశంలో మేడే ప్రారంభమై 100 ఏళ్లు పూర్తి కావస్తోంది.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకురాలు కామ్రేడ్ సొంటేన హైమావతి గారు మాట్లాడుతూ కార్మిక రక్షణ చట్టాలన్నీ రద్దు చేసి,నాలుగు లేబర్ కోడ్లు గా మార్చి ,కార్మికుల చట్టాలు తుంగలో తొక్కు తున్నారన్నారు.8 గంటల పని దినం రద్దు చేసి 11 గంటలు పనిచేసేలా కొత్తగా చట్టంలో చేర్చారు, నెలకు కనీస జీతం 26 వేలు ఇవ్వాల్సి ఉన్న ఎక్కడ అంత వేతనం ఇవ్వటం లేదు.ఉన్నా ప్రభుత్వ రంగ కంపెనీలైన బీ.ఎస్.ఎన్. ఎల్,రోడ్, ఎల్ఐసీ,పోర్టులు,రైల్వే ,విశాఖ స్టీల్ ప్లాంట్ లు మోడీ,బీజేపీ ప్రభుత్వం ,మోడీ స్నేహితులైన అధాని,అంబానీల కు అప్ప జెప్తున్నారు.ఈ నిర్ణయం తో ఎస్సి,ఎస్టీ,బీసీ, మైనారిటీ, అణగారిన వర్గాల వారు ఉద్యోగాలు ,రిజర్వేషన్లు కోల్పోతున్నారు. హుకుంపేట మండల పరిషత్ వైస్ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు మాట్లాడుతూ పోరాటాల ద్వారానే మెరుగైన జీవితం లభిస్తుందని..పోరాడితే..పోయేదేమీ లేదని...బానిస సంకెళ్ళు తప్పా.. అన్న... మార్క్స్ మాటలను ఆదర్శంగా తీసుకుని పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గన్నేరుపుట్టు మాజీ సర్పంచ్ ఎస్ పీ ఎ ల్ ప్రమీల,నాయకులు
మామిడి సూరిబాబు,వంతాల సత్తిబాబు, దాసరి సూరిబాబు, నతక నానీ బాబు తదితరులు పాల్గొన్నారు.










