Aug 15,2023 23:10

శ్రీకాకుళం అర్బన్‌ : జెండాను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌: దేశవ్యాప్తంగా నిర్వహించిన స్వతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లాలో వాడవాడలా ఉత్సాహంగా త్రివర్ణ పతాకాలను ఎగురవేశారు. కలెక్టరేట్‌ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌, జెసి ఎం.నవీన్‌, ట్రైనీ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా, డిఆర్‌ఒ మురళీకృష్ణ, ఎఒ రాజేశ్వరరావులు పుష్పాంజలి ఘటించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
అలాగే టిడిపి కార్యాలయం వద్ద ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌ ఎగురవేసిన జెండా కార్యాక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి. ఉపాధ్యక్షులు చిట్టి మోహన్‌, మాదరపు వెంకటేష్‌ పాల్గొన్నారు.
ఎస్‌పి కార్యాలయం వద్ద ఎస్‌పి జి.ఆర్‌.రాధిక, అదనపు ఎస్‌పి విఠలేశ్వర్‌, వైసిపి కార్యాలయం వద్ద జిల్లా అధ్యక్షులు, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌, జెడ్‌పి చైర్‌పర్సన్‌ పిరియా విజయ జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి డాక్టర్‌ కిల్లి కృపారాణి, అంధవరపు సూరిబాబు, మెంటాడ స్వరూప్‌, మామిడి శ్రీకాంత్‌, ఇతర నాయకులు పాల్గొన్నారు.
భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యాన డైమాండ్‌ పార్కు వద్ద సీనియర్‌ నాయుడు దాలినాయుడు జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు ఎం.ఆదినా రాయణమూర్తి, అధ్యక్షులు ఎం.హరనాత్‌లు, కోశాధికారి ఎ.కామేశ్వరరావు, కమిటీ సభ్యులు కె.చిన్నారావు జి.భీమారావు పాల్గొన్నారు.
సామాజిక కార్యకర్త, వ్యాపార వేత్త డాక్టర్‌ సూర శ్రీనివాసరావు నగరంలోని పాలిటెక్నిక్‌ కళాశాల సమీపాన నిర్మాణంలో ఉన్న కళ్యాణ మండపం వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు.
ఆర్‌టిసి జిల్లా ప్రజారవాణా అధికారి కార్యాలయం ఆవరణలో జిల్లా అధికారి ఎ.విజరు కుమార్‌ పతాకాన్ని ఆవిష్కరించారు.
గాంధీ మందిరంలో గాంధీ మందిర ప్రతినిధి బృందం జి.ఎస్‌.రామారావు, జామీ భీమశంకర్‌, పి.వి.ఎస్‌.రామ్మోహన రావు, మెట్ట అనంతంభట్లు, కొంక్యాన మురళీధర్‌, పందిరి అప్పారావు, కొంక్యాన వేణుగోపాల్‌, మహీబుల్లా ఖాన్‌, కొమ్ము రమణమూర్తి, తర్లాడ అప్పలనాయుడు, కె.ఎస్‌.పట్నాయక్‌, పందిరి ప్రవీణ్‌ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు.
నగరంలోని జారు కిడ్స్‌ స్కూల్‌లో చిన్నారులు స్వతంత్య్ర సమరయోధుల వేషధారణలో సందడి చేశారు. కార్యక్రమంలో స్కూల్‌ కరస్పాండెంట్‌ జామి స్రవంతి కిరణ్‌ పాల్గొన్నారు.
పొట్టిశ్రీరాములు మార్కెట్‌లో ముఠా కళాసీ యూనియన్‌ ఆధ్వర్యాన జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సిఐటియు నగర కార్యదర్శి తిరుపతిరావు, సీనియర్‌ నాయకులు సూర్య పాల్గొన్నారు. అనంతరం గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.
ఎచ్చెర్ల : ట్రిపుల్‌ ఐటిలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ట్రిపుల్‌ ఐటి డైరెక్టర్‌ పి.జగదీశ్వరరావు ఎగురవేశారు. కార్యక్రమంలో ఒఎస్‌డి సుధాకర్‌బాబు, పరిపాలన అధికారి మునిరామకృష్ణ, డీన్‌ మోహన్‌కృష్ణ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం : రోటరీ క్లబ్‌ శ్రీకాకుళం సెంట్రల్‌ కార్యాలయంలో క్లబ్‌ అధ్యక్షులు ఎరుకోల మురళీమోహనరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో కె.నాగేశ్వరరావు, ఎం.నాగేశ్వరావు, కోరాడ హరగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.
రణస్థలం: స్థానిక ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌, ఎంపిడిఒ కార్యాలయం వద్ద ఎంపిపి ప్రతినిధి పిన్నింటి సాయికుమార్‌, పోలీసు సర్కిల్‌ కార్యాలయం ఆవరణలో సిఐ ఎస్‌.ఆదాం, తహశీల్దార్‌ కార్యాలయం వద్ద తహశీల్దార్‌ కిరణ్‌కుమార్‌, పోలీసు స్టేషన్‌ వద్ద ఎఎస్‌ఐ లక్ష్మణరావులు జాతీయ జెండాలను ఎగురవేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంఇఒలు ఎ.త్రినాథరావు, బి.లావణ్య పాల్గొన్నారు. అలాగే మండలంలో జె.ఆర్‌.పురం పంచాయతీ గొల్లపేట ప్రభుత్వ పాఠశాలలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా వైఎస్‌ఆర్‌ సేవాదళ్‌ జోనల్‌ ఇన్‌ఛార్జి పిన్నింటి గౌరినాయుడు పుస్తకాల కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ భవిరి రమణ, వైస్‌ ఎంపిపి రాయిపురెడ్డి బుజ్జి, తిరుపతిరాజు, రాజశేఖర్‌, గండమాని రమణ పాల్గొన్నారు.
పోలాకి: మండలంలోని మబగాం ఉన్నత పాఠశాల ఆవరణలో ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌, తహశీల్దార్‌ కార్యాలయం వద్ద డిటి పి.శ్రీనివాసరావు, మండల పరిషత్‌ సలహదారులు ముద్దాడ భైరాగినాయుడు, మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఎంపిడిఒ ఉషశ్రీ వెలుగు కార్యాలయం వద్ద ఎపిఎం జి.రాజారావు, పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఎస్‌ఐ సత్యనారాయణ, ఎస్‌.ఎల్‌.పురంలో సర్పంచ్‌ ప్రతినిధి వై.వెంకటరమణలు జాతీయ జెండాలను ఎగురవేశారు. వైస్‌ ఎంపిపి కోట అప్పారావు, నాయకకులు కృష్ణారావు, కణితి సత్తిబాబు, ఆర్‌.త్రినాథరావు పాల్గొన్నారు.
కవిటి: మండలంలోని ప్రగడపుట్టుగ, చిన్నకర్రివానిపాలెం గ్రామాల్లో ఎమ్మెల్యే బెందాళం అశోక్‌, లండారిపుట్టుగ సచివాలయం వద్ద ఎమ్మెల్సీ నర్తు రామారావు, ఎఎంసి కార్యాలయం వద్ద చైర్మన్‌ బాబూావు, వైస్‌ చైర్మన్‌ నీలయ్య, ఎంపిడిఒ కార్యాలయం వద్ద ఎంపిపి కడియాల పద్మ, తహశీల్దార్‌ కార్యాలయం వద్ద తహశీల్దార్‌ శేఖర్‌, పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఎస్‌ఐ కె.రాము జాతీయ జెండాలను ఎగురవేశారు. అనంతరం ఎమ్మెల్యే చిన్నకర్రివానిపాలెం పాఠశాల వద్ద నూతనంగా నిర్మించిన అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
నందిగాం : మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఎంపిపి నడుపూరు శ్రీరామ్ముర్తి, తహశీల్దార్‌ కార్యాలయం వద్ద తహసీల్దార్‌ వై.వి.పద్మావతి, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల వద్ద పాఠశాల చైర్మన్‌ ఎస్‌.చిన్నారావు, పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్‌ జె.రమణమ్మ, పెద్దతామరపల్లి పాఠశాల వద్ద ప్రధానోపాధ్యాయులు బి.శంకరరావు, నందిగాం పాఠశాల వద్ద ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖరరావు, ప్రతాప్‌ విశ్వనాథపురంలో ఎపి రైతు సంఘం గ్రామ కార్యదర్శి బమ్మిడి కామరాజులు జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో ఎపి గొర్రెల మేకల పెంపకందారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలిన సాంబమూర్తి, పి.బాలరాజు, కె.వల్లభరావు, జె.రాజేష్‌, బి.ప్రసాద్‌ పాల్గొన్నారు.
ఆహ్వానం లేదు : చైర్మన్‌
నౌపడ : సంతబొమ్మాళి మండలం హెచ్‌.ఎన్‌.పేట వైసిపి కార్యాలయం వద్ద జెడ్‌పిటిసి పాల వసంతరెడ్డి, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల వద్ద పిలకా బృందాదేవి, యామాలపేటలో సర్పంచ్‌ ముదిలి సంజీవ్‌, భావనపాడు సర్పంచ్‌ మోహన్‌రెడ్డి, నౌపడ టిడిపి కార్యాలయం వద్ద మాజీ సర్పంచ్‌ విష్ణుమూర్తిలు జాతీయ జెండాను ఆవిష్కరించారు.
రణస్థలం రూరల్‌ : మండలంలోని బంటుపల్లి సచివాలయం వద్ద సర్పంచ్‌ నడుకుదిటి రజని, ఎన్‌ఇఆర్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ వద్ద ఎన్సిసి శ్రీకాకుళం జిల్లా యూనిట్‌ హెడ్‌ కల్నల్‌ బెనర్జీ, వేల్పురాయిలో సర్పంచ్‌ బాలి శ్రీను, అర్జునవలసలో సర్పంచ్‌ మీసాల లక్ష్మి, సంచాంలో సర్పంచ్‌ రెడ్డి సూర్య కాంతం, దేవరాపల్లిలో సర్పంచ్‌ మీసాల సరస్వతి, తిరుపతిపాలెంలో సర్పంచ్‌ ఆకుల రవికుమార్‌, నెలివాడలో సర్పంచ్‌ పతివాడ శ్రీరామ్మూర్తి, పతివాడపాలెంలో సర్పంచ్‌ రెడ్డి విశ్వేశ్వరరావు, కోష్టలో సర్పంచ్‌ పిసిని హరి, కొండములగాంలో సర్పంచ్‌ గొర్లె మంజుల జాతీయ జెండాను ఆవిష్కరించారు.
స్థానిక ప్రభుత్వ కళాశాల వద్ద నిర్వహించిన స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రిన్సిపాల్‌ తనను ఆహ్వానించలేదని చైర్మన్‌ ప్రగడ ఈశ్వరరావు తెలిపారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని అన్నారు.
మెళియాపుట్టి : తహశీల్దార్‌ కార్యాలయం వద్ద తహశీల్దార్‌ పి.సరోజని, మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఎంపిడిఒ పి.చంద్రకుమారి, ఎంఆర్‌సి వద్ద ఎంఇఒ ఎస్‌.దేవేందర్రావు, పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఎస్‌ఐ టి.రాజేష్‌, మెళియాపుట్టి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వద్ద ప్రిన్సిపాల్‌ వైకుంఠరావు, ఎస్‌కెకె జూనియర్‌ కళాశాల వద్ద ప్రిన్సిపాల్‌ ఎస్‌.దయానంద్‌లు జాతీయ జెండాను ఎగురవేశారు.
ఉత్తమ అధికారులకు అవార్డులు
పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ఐటిడిఎ పరిధిలో ఉత్తమ అధికారుగా స్థానిక తహశీల్దార్‌ పి.సరోజని, ఎపిఒ రవి, పరశురాపురం కార్యదర్శి శివాజీ, విఎఎ దుక్కు శరత్‌కుమార్‌రెడ్డి పిఒ కల్పనాకుమారి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.
టెక్కలి రూరల్‌ : టెక్కలి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ఆవరణలో చైర్మన్‌ డాక్టర్‌ కొంచాడ సోమేశ్వరరావు జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో కార్యదర్శి ఎల్‌.ఎల్‌.నాయుడు, కోశాధికారి టంకాల నాగరాజు, డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వి.వి.నాగేశ్వరరావు పాల్గొ న్నారు. అలాగే డిఎస్‌పి కార్యాలయం వద్ద డిఎస్‌పి బాలచంద్రా రెడ్డి, సర్కిల్‌ కార్యాలయం వద్ద సిఐ సూర్య చంద్రమౌళి, జూనియర్‌ కళాశాల వద్ద ప్రిన్సిపాల్‌ కోట ప్రకాశరావు, పశుసంవర్థక శాఖ కార్యాలయం వద్ద డిడి జయరాజు, మండల పరిషత్‌ కార్యాలయం వద్ద నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ వాణి, టెక్కలి పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్‌ గొండెలి సుజాత, బన్నువాడలో రైతు సంఘం తరపున బగాది వాసుదేవరావు, తెప్పల లక్ష్మణరావు, రావివలస పంచాయతీ కార్యాలయం వద్ద సర్లాన బాలకృష్ణ, కె.కొత్తూరులో శంకరరావు, పోలవలరంలో గురువెల్లి బాలకృష్ణ, తిర్లంగిలో సనపల మౌనజ, ఆదిఆంధ్రావీధి ప్రాథమిక పాఠశాలలో సిపిఎం నాయకులు కొల్లి ఎల్లయ్యలు జాతీయ జెండాలను ఆవిష్కరించారు.
లావేరు : మండల పరిషత్‌ కార్యాలం వద్ద ఎంపిపి ఎంపిపి లుట్ట అమ్మాజమ్మ, తహశీల్దార్‌ కార్యాలయం వద్ద తహశీల్దార్‌ సాధు దిలీప్‌ చక్రవర్తి, పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఎఎస్‌ఐ ప్రసాద్‌, మురపాక కెజిబివి వద్ద చైర్‌పర్సన్‌ రాధలు జాతీయ జెండాలను ఎగురవేశారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక ఆహ్వానితులు రొక్కం బాలకృష్ణ, ఎంపిడిఒ కె.సురేష్‌ఖుమార్‌, వైస్‌ ఎంపిపి లుకలాపు శ్రీనివాసరావు పాల్గొన్నారు. అలాగే లావేరు శాఖాగ్రంథాలయం ఆధ్వర్యాన విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో గ్రంథాలయాధికారి మురపాక శ్రీనివాసరావు, ఎ.గడ్డియ్య పాల్గొన్నారు.
గుజరాతీపేట : నగరంలోని పి.ఎన్‌.కాలనీలో ఉన్న మెహర్‌ విద్యాలయంలో నిర్వహించిన స్వతంత్య్ర దినోత్సవంలో ముఖ్య అతిథిగా డాక్టర్‌ నికు అప్పన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్‌ బరాటం లక్ష్మణరావు, డి.వెంకటేశ్వరరావు, కరస్పాండెంట్‌ వి.కామేశ్వరరావు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కొత్తూరు : తహశీల్దార్‌ కార్యాలయం వద్ద తహశీల్దార్‌ ఎం.చక్రవర్తి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద విద్యా కమిటీ చైర్మన్‌ వడమ శ్రీను, పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఎస్‌ఐ ఎం.గోవింద్‌, శాఖాగ్రంథాలయం వద్ద గ్రంథాలయాధికారి టి.ఇందిరలు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఉన్నత పాఠశాలలో విద్యార్థులో ప్రధానోపాధ్యాయులు ఎ.గోవిందరావు సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపిపి సవర సావిత్రి, ఆనంత్‌కుమార్‌, మండల సర్వేయర్‌ రమణయ్య, సర్పంచ్‌ పి.కృష్ణవేణి, ప్రతినిధి ఆనందరావు, కలమట సాగర్‌ పాల్గొన్నారు.
జలుమూరు: మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఎంపిపి వాన గోపి, తహశీల్దార్‌ కార్యాలయం వద్ద జెడ్‌పిటిసి మెండ విజయశాంతి జాతీయ జెండాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షుడు కనుసు సీతారాం, వైస్‌ ఎంపిపిలు తంగి మురళీకృష్ణ, డోల నాగరత్నం, ఎంపిడిఒ ఎల్‌.వి.అప్పారావు, తహశీల్దార్‌ పి.శ్రీనివాస్‌, ఇఒపిఆర్‌డి ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.
ఆమదాలవలస : కోర్టు ఆవరణలో సివిల్‌ జడ్జి ఎస్‌.మణి, తహశీల్దార్‌ కార్యాలయం వద్ద తహశీల్దార్‌ ఎస్‌.గణపతిరావు, మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ ఎం.రవిసుధాకర్‌, ఎంపిడిఒ కార్యాలయం వద్ద ఎంపిపి ప్రతినిధి తమ్మినేని శ్రీరామ్మూర్తి, రవీంద్ర భారతి పాఠశాల వద్ద వైద్యులు చాపర సుధాకర్‌, పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఎస్‌ఐ వై.కృష్ణ, వెదుళ్లవలస ఉన్నత పాఠశాల వద్ద సర్పంచ్‌ చిలకలపల్లి సురేష్‌లు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమంలో జెడ్‌పిటిసి బెండి గోవిందరావు, ఎంపిడిఒ ఎస్‌.వాసుదేవరావు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కణితి విజయలక్ష్మి, న్యాయవాదులు చాపర సుధాకర్‌, బొడ్డేపల్లి మోహనరావు పాల్గొన్నారు. మండలంలోని అక్కులపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షల్లో అత్యధిక మార్పులు సాధించిన వాడాడ శైలజకు స్పెషల్‌ కాంట్రాక్టర్‌ పేడాడ వెంకట సూర్యనారాయణ రూ.5 వేలు తన తండ్రి, విశ్రాంత ఉపాధ్యాయులు పేడాడ ప్రకాశరావు చేతుల మీదగా అందజేశారు.
ఉత్తమ ఎంఐఎస్‌ కో-ఆర్డినేటర్‌గా రమణారావు
మండలంలోని ఎంఆర్‌సిలో పనిచేస్తున్న ఎంఐఎస్‌ కో-ఆర్డినేటర్‌ ఎం.వి.రమణారావు జిల్లా ఉత్తమ ఎంఐఎస్‌ కోఆర్డినేటర్‌గా ఎంపికయ్యారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్షా అభియాన్‌లో ఎడిషనల్‌ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్‌ రోణంకి జయప్రకాష్‌ మంగళవారం ఉత్తమ సేవలు అందించినందుకు అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అవార్డు తనపై ఎంతో బాధ్యతను పెంచిందన్నారు. తోటి ఉద్యోగులు రమణారావుకు శుభాకాంక్షలు తెలిపారు.
వజ్రపుకొత్తూరు : తహశీల్దార్‌ కార్యాలయం వద్ద తహశీల్దార్‌ అప్పలస్వామి, మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఎంపిపి ఉప్పరపల్లి నేలవేణి, ఉదరు కుమార్‌, పిఎసిఎస్‌ వద్ద వ్యవసాయ ప్రాథమిక పరపతి సంఘం అధ్యక్షుడు దువ్వాడ మధుకేశ్వరరావు, గోవిందపురం సచివాలయం వద్ద సర్పంచ్‌ రమ్య, అమలపాడు సచివాలయంలో సర్పంచ్‌ దున్న రత్నం బాలరాజు, బాతుపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సర్పంచ్‌ బత్తిని సృజన, సైనూరు పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్‌ అట్టాడ గోవిందరావు, రేయిపాడు సచివాలయం వద్ద సర్పంచ్‌ బచ్చల ధర్మారావు, కొండవురు సర్పంచ్‌ భాస్కరరావు, పల్లివురు సర్పంచ్‌ మామిడి భాస్కరరావు, నగరంపల్లిలో సర్పంచ్‌ దువ్వాడ పద్మావతిలు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. గోవిందపురం జిల్లా పరిషత్‌ పాఠశాలలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి 500 పైగా మార్కులు సాధించిన ఆరుగురు విద్యార్థులకు జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ పాలిన శ్రావణి, ప్రతినిధి శ్రీనివాసరావు, సర్పంచ్‌ పాలిన రమ్య, ప్రతినిధి చిరంజీవి తమ సొంత నిధులతో నగదు పురస్కారాలు అందజేశారు.
మండలంలోని నగరంపల్లిలో సిపిఎం సీనియర్‌ నాయకులు బమ్మిడి శ్రీరాములు జాతీయ జెండాను ఎగురవే శారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ ఎన్‌.మోహనరావు, రైతు సంఘం నాయకులు టి.భాస్కరరావు, బి.రామకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డి.భానుమతి, భాస్కరరావు, పిఎన్‌ఎం నాయకులు నెయ్యల చంద్రయ్య, నెయ్యల సింహాచలం, మహిళా సంఘం నాయకులు, ఎన్‌.ఈశ్వరమ్మ, టి.లక్ష్మి, బి.లక్ష్మి, టి.నిర్మల, భవన నిర్మాణ సంఘం నాయకులు ఎస్‌.మల్లేష్‌, సింగారి ఆదినారాయణ, బమ్మిడి లక్ష్మీపతి, ఎస్‌.పారమ్మ, లోలాక్షి, పీర్ల సింహాచలం పాల్గొన్నారు.
పలాస : పలాస కోర్టు ఆవరణలో ఇన్‌ఛార్జి సివిల్‌ జడ్జి బేజా చక్రవర్తి, టిడిపి కార్యాలయంలో వద్ద మాజీ మంత్రి గౌతు శ్యాంసుందర శివాజీ, మున్సిపల్‌ కార్యాలయం వద్ద చైర్మన్‌ బల్ల గిరిబాబు, తహశీల్దార్‌ కార్యాలయం వద్ద తహశీల్దార్‌ ఎల్‌.మధుసూదనరావు, మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఎంపిపి ఉంగ ప్రవీణ, కాశీబుగ్గ పోలీస్‌ స్టేషన్‌ వద్ద సిఐ శ్రీనివాసరావు, పద్మనాభపురం కాలనీ పాఠశాలలో వైస్‌ చైర్మన్‌ మీసాల సురేష్‌బాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మండలంలోని బ్రాహ్మణతర్ల బజార్‌ వీధిలో, పలాస పిఎసిఎస్‌ కార్యాలయం, కాశీబుగ్గ డిసిసిబి బ్యాంకు వద్ద పిఎసిఎస్‌ అధ్యక్షులు పైల వెంకటరావు చిట్టి జాతీయ జెండాలను ఆవిష్కరించారు. జూనియర్‌ కళాశాల, కాశీబుగ్గ సూర్యతేజ కళాశాల, విద్యావాహిని కళాశాల, కాశీబుగ్గ లక్కీ షాపింగ్‌ మాల్‌ వద్ద స్వతంత్ర వేడుకలు నిర్వహించారు. ఆయా కార్యాక్రమాల్లో టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి పి.విఠల్‌రావు, గాలి కృష్ణారావు, వైస్‌ చైర్మన్‌ మీసాల సురేష్‌బాబు, మున్సిపల్‌ కమిషనర్‌ టి.నాగేంద్రకుమార్‌, యుటిఎఫ్‌ నాయకులు లఖినాన డిల్లీశ్వరరావు, బి.ఓంకార్‌ పాల్గొన్నారు. పిసిఎంఎ కార్యాలయం వద్ద పిసిఎంఎ అధ్యక్షులు మల్లా సురేష్‌ కుమార్‌ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో ఎంపిడిఒ రమేష్‌నాయుడు, ఎంఇఒలు సిహెచ్‌.శ్రీనివాసరావు, సత్యం, వెలుగు ఎపిఎం మల్లేశ్వరరావు, కె.వి.శివకృష్ణ, పి.రమాకాంత్‌ పాల్గొన్నారు.
బూర్జ : మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఎంపిపి కె.దీప, తహశీల్దార్‌ కార్యాలయం వద్ద జెడ్‌పిటిసి బి.రామారావు జాతీయ జెండాలను ఎగురవేశారు. ఆయా కార్యాక్రమాల్లో తహశీల్దార్‌ ఎస్‌.రమణారావు, ఎంపిడిఒ రవీంద్రబాబు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
ఇచ్ఛాపురం : మున్సిపల్‌ కార్యాలయం వద్ద చైర్‌పర్సన్‌ పి.రాజ్యలక్ష్మి, తహశీల్దార్‌ కార్యాలయం వద్ద జెడ్‌పిటిసి ఉప్పాడ నారాయణమ్మ, మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఎంపిపి బోర పుష్ప, పోలీస్‌ స్టేషన్‌ వద్ద సిఐ ఈశ్వర్‌ చంద్రప్రసాద్‌, ఎంఆర్‌సి వద్ద ఎంఇఒ అప్పారావు, జనసేన కార్యాలయం వద్ద నియోజకవర్గ ఇన్‌ఛార్జి దాసరి రాజు, స్వర్ణభారతి విద్యా సంస్థల వద్ద చైర్మన్‌ చాటల తులసీదాస్‌రెడ్డి, శాంతి నికేతన్‌ విద్యా సంస్థల వద్ద చైర్మన్‌ దక్కత కృష్ణమూర్తిరెడ్డి, జ్ఞానభారతి విద్యాససంస్థల వద్ద కార్యదర్శి జోహర్‌ఖాన్‌ జాతీయ జెండాలను ఆవిష్కరించారు. జ్ఞానభారతి స్కూల్‌లో విద్యార్థులు ప్రదర్శించిన కవాతు అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథిగా సిఐ ఈశ్వర్‌ చంద్ర ప్రసాద్‌, టౌన్‌ ఎస్‌ఐ గోవిందరావు పాల్గొన్నారు. ఎల్లం ఆలయం వద్ద రైతు కులం ఆధ్వర్యాన స్వతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు.
సంతబొమ్మాళి : తహశీల్దార్‌ కార్యాలయం వద్ద తహశీల్దార్‌ జె.చలమయ్య, పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఎఎస్‌ఐ సుందరరావు, పిఎసిఎస్‌ కార్యాలయం వద్ద చైర్మన్‌ కెల్లి జగన్నాయకులు, నరసాపురం సచివాలయం వద్ద సర్పంచ్‌ దుక్క భూషణరెడ్డి, గోవిందపురం సచివాలయం వద్ద సర్పంచ్‌ రెయ్య రామిరెడ్డి, రుంకు హనుమంతుపురం సచివాలయం వద్ద సర్పంచ్‌లు జోగి రాములమ్మ, ఎన్ని మన్మథరావు, పాలతలగాం సచివాలయం వద్ద సర్పంచ్‌ నక్కిట్ల అప్పన్న, సూరాడవానిపేట తల్లిదండ్రుల కమిటీ చైర్మన్‌ సూరాడ జోగారావు, పాత మేఘవరంలో తల్లిదండ్రుల కమిటీ చైర్మన్‌ సిరిగిడి లక్ష్మి, మేఘవరం సచివాలయం వద్ద సర్పంచ్‌ పరపటి సునీతరెడ్డి, మలగాం సచివాలయం వద్ద సర్పంచ్‌ ప్రతినిధి సూరాడ వెంకటేష్‌, బోరుభద్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద మెడికల్‌ ఆఫీషర్‌ డాక్టర్‌ పి.అవనిలు జెండాను ఎగరవేశారు.
టెక్కలి : కోర్టు ఆవరణలో మెజిస్ట్రేట్‌ తేజచక్రవర్తి మళ్ల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ తెంబురు గోవిందమ్మ, ఆదర్శ పాఠశాల వద్ద నౌపడా సింహచలం, ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద పిఒ పి.శోభారాణి, టెక్కలి ఉపఖజానా శాఖ కార్యాలయం వద్ద ఎటిఒ రామకృష్ణ, టెక్కలిశాఖ గ్రంథాలయంలో విశ్రాంత గ్రంథాలయ ఉద్యోగి తమిరె వైకుంఠరావు, టిడిపి కార్యాలయం వద్ద వద్ద మండల పార్టీ అధ్యక్షులు బగాది శేషగిరి, జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఇన్‌ఛార్జి కణితి కిరణ్‌కుమార్‌, కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం వద్ద డాక్టర్‌ పేడాడ పరమేశ్వరరావు, దళిత హక్కుల పోరాట సమితి కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు యడ్ల గోపి, పేడాడ విద్యాసంస్థల వద్ద ఇజ్జువరం సర్పంచ్‌ రోణంకి లావణ్య, రవీంద్రభారతి పాఠశాల వద్ద డీన్‌ నాగరాజు, ఓక్లాండ్‌ అంతర్జాతీయ పాఠశాల వద్ద ప్రిన్సిపాల్‌ మళ్లా మధులత, బిఎస్‌జెఆర్‌ డిగ్రీ కళాశాల వద్ద కరస్పాడెంట్‌ డాక్టర్‌ కోత మురళీధర్‌ జాతీయ జెండాలను ఆవిష్కరించాఉఉ.
కోటబొమ్మాళి : కోర్టు ఆవరణలో సివిల్‌ జడ్జి డి.భరణి, మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఎంపిపి రోణంకి ఉమామల్లేశ్వరరావు, జెడ్‌పిటిసి వెంకటరావు, ఎంఆర్‌సి వద్ద ఎంఇఒలు ఎస్‌.ఎల్‌.వి.ప్రతాప్‌, సంపతిరావు హేమసుందరరాజులు, పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఎస్‌ఐ షేక్‌మహ్మద్‌ ఆలీ, కోటబొమ్మాళి పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్‌ కాళ్ల సంజీవరావు, మండల పరిషత్‌ ఉపాధ్యక్షులు బోయిన నాగేశ్వరరావు, పిఎసిఎస్‌ కార్యాలయం వద్ద అధ్యక్షులు బాడాన మురళి, కోటబొమ్మాళి ప్రాంతీయ పశువుల ఆస్పత్రి వద్ద పశువైద్యాధికారి లఖినేని కిరణ్‌కుమార్‌, పశు వైద్య సహాయ సంచాలకులు డాక్టర్‌ మందా లోకనాథం, అసుపత్రిలో చీపుర్లపాడు పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్‌ నేతింటి అప్పలస్వామి, మండల విప్‌ బొడ్డు అప్పన్న జాతీయ జెండాలను ఆవిష్కరించారు. మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపిడిఒ ఫణీంద్రకుమార్‌ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు.
పొందూరు: పొందూరు ఫస్ట్‌ క్లాస్‌ జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు వద్ద జూనియర్‌ సివిల్‌ జడ్జి బి.జోత్స్న, తహశీల్దార్‌ కార్యాలయం వద్ద డిటి వెంకటేష్‌, మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఎంపిపి కిల్లి ఉషారాణి, పిఎసిఎస్‌ వద్ద అధ్యక్షులు కొంచాడ రమణమూర్తి, ఎఎంసి కార్యాలయం వద్ద చైర్మన్‌ బాడాన సునీల్‌ కుమార్‌, ఎఫ్‌కెకె సంఘం వద్ద అధ్యక్షుడు జి.కామేశ్వరప్రసాద్‌, ఎపి మోడల్‌ స్కూల్‌ వద్ద ప్రిన్సిపాల్‌ హెచ్‌.ప్రభాకర్‌, లోలుగు కెజిబివి వద్ద ప్రిన్సిపాల్‌ ఆర్‌.సౌమ్య, ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద డాక్టర్‌ డి.రామారావు, పొందూరు మేజర్‌ పంచాయతీ వద్ద సర్పంచ్‌ రేగడి లక్ష్మిలు జాతీయ జెండాను ఎగురవేశారు.
జి.సిగడాం : తహశీల్దార్‌ కార్యాలయం వద్ద తహశీల్దార్‌ పి.వేణు గోపాలరావు, మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఎంపిపి మీసాల సత్యవతి, పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఎస్‌ఐ చామంతుల రామారావు, మోడల్‌ స్కూల్‌, కెజిబివి, ఎంపిపి, సచివాలయాల వద్ద జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల విన్యాసాలతో జెండాను ఎగరవేశారు.
పర్లాకిమిడి : పర్లాకిమిడిలో సిపిఎం కార్యాలయం వద్ద జిల్లా కమిటీ సభ్యులు ముచ్చి బంగారు జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో మహిత మిషాల్‌, పర్లాకిమిడి పట్టణ బాధ్యులు డి.వెంకటరావు, చలపతిరావు, శ్రీను బెహరా, లోకేశ్వరరావు పాల్గొన్నారు. ఎన్‌ఎసి కార్యాలయం వద్ద వంశధార పాఠఘర్‌ వద్ద జెండాను ఆవిష్కరించారు. అలాగే కాశీనగర్‌ శ్రీరాం డిగ్రీ, జూనియర్‌ కళాశాలల వద్ద, వారణాసి ప్రభుత్వ హైస్కూల్‌ స్వతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అంబేద్కర్‌ యువసేన సంఘం ఆధ్వర్యాన వారు కాశీనగర్‌లో ర్యాలీ నిర్వహించారు.