
ప్రజాశక్తి - రేపల్లె
దేశవ్యాప్తంగా కార్మిక సమస్యలు పరిష్కారం కోసం నవంబర్ 27, 28తేదీల్లో విజయవాడలో జరుగుతున్న మహపడవో ధర్నాలో కార్మికులు పాల్గొలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు సీహెచ్ మణిలాల్ కోరారు. స్ధానిక సీఐటీయూ కార్యాలయంలో రైస్ మిల్ ముఠా వర్కర్స్, డ్రైవర్స్ యూనియన్ సమావేశం యు సుబ్బారావు అధ్యక్షతన గురువారం నిర్వహించారు. మణిలాల్ మాట్లాడుతూ రైస్ మిల్లులో పనిచేస్తున్న ముఠావర్కర్లు, డ్రైవర్స్‌కు కార్మిక చట్టాలు అమలు కావడం లేదని అన్నారు. అందరికీ పిఎఫ్, ఈఎస్ఐ, బోనస్, ఐడి కార్డ్స్, పనిభద్రత అమలు చేయాలని కోరారు. అదేవిధంగా రైస్ మిల్ ముఠావర్కర్ల కూలి రేట్లు రోజువారి పెరుగుతున్న ధరలకు తగ్గట్లు పెంచాలని కోరారు. ఈ సమావేశంలో ది రేపల్లె తాలూకా రైస్ మిల్ యూనియన్ ముఠా వర్కర్స్, డ్రైవర్స్ యూనియన్ కె మాణిక్యరావు, మస్తాన్, కె .శ్రీనివాసరావు, బి ఏడుకొండలు, వి శంకర్రావు పాల్గొన్నారు.