Aug 31,2023 00:23

నినాదాలు చేస్తున్న ముఠా కార్మికులు

ప్రజాశక్తి -నర్సీపట్నం టౌన్‌: ముఠా కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని సిఐటియు నేతలు డిమాండ్‌ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో స్థానిక ఐదో వార్డ్‌ సచివాలయం వద్ద బుధవారం నిరసన చేపట్టారు. సచివాలయం సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు, కెవిపిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రెల్లి చిరంజీవి మాట్లాడుతూ, ముఠా కార్మికులు నర్సీపట్నం డివిజన్‌ పరిధిలో 300 మంది ఉన్నారని, ప్రతిరోజు షాపులకు ఎగుమతులు దిగుమతులు చేస్తూ ఉంటారని తెలిపారు. ప్రభుత్వాలు వీరిని పట్టించుకోలేదన్నారు. తో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ వ్యాపారాలతో వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని తెలిపారు. ముఠా కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించాలని ప్రమాద బీమా, గుర్తింపు కార్డులు, ఈఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ముఠా కార్మికులకు ప్రత్యేకమైన చట్టం ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా ఉపాధ్యక్షులు కేవీ సూర్యప్రభ, ముఠా కార్మిక సంఘం అధ్యక్షులు గోవిందు, రమణ, శ్రీను, అప్పారావు పాల్గొన్నారు