
ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు : తోటపల్లిగూడూరు మండలం కోడూరు సముద్ర తీరంలో మం గళవారం కొందరు మత్స్యకా రులు ముత్యాల కోసం గాలిం పు చేపట్టారు. సముద్ర జీవుల ద్వారా ముత్యాలు ఉత్పత్తి అ వుతాయని వినికిడి. ముత్యా లు మొలస్కా జాతికి చెందిన ముత్యపు చిప్పలలో తయార వుతాయని సైన్స్ చెబు తోంది. సముద్రంలో మొదటగా కొన్ని ఇసుక రేణువులు ము త్యపు చిప్పలోకి ప్రవేశిస్తాయ ని, అవి కలిగించే చలనం వలన ము త్యపు చిప్ప వాటిపైకి ఒక ప్ర త్యేక మైన ద్రవ పదార్థాన్ని వి డుదల చేస్తుందని, అది గట్టి పడి ముత్యంగా రూపాంతరం చెందు తుందని విజ్ఞాన శాస్త్రం వివరిస్తోంది. ముత్యాలు, అ త్యంత మెరిసే రత్నాలలో ఒక టి. అంతేకాక అవి ప్రకతి యొక్క అత్యంత ప్రత్యేకమైన సష్టి. ఈ సీజన్లో ముత్యాలు లభిస్తాయన్న ఉద్దేశ్యంతో మత్స్యకారులు సముద్ర తీరంలో వాటి కోసం వేదుకుతుంటారు. ఈ మేరకు కోడూరు బీచ్ లో మత్సకారులు ముత్యాల కోసం గాలించారు.