Nov 11,2023 20:38

ముట్టకుంటే పేలిపోతున్న టపాసులు

ఒంటిమిట్ట : మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన బాణాసంచా దుకాణాల్లో టపాసులు పట్టుకుంటే పేలిపోతున్నాయని, వాటి ధరలు ఆకాశా నంటుతున్నాయని, నియంత్రించడంలో అధికారులు విఫలం చెందారని ప్రజలు పేర్కొన్నారు. దుకాణ దారులు ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయించి విక్రయి స్తున్నారు. అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని ఒక పక్కా చెబుతున్న అధికారుల హెచ్చరి కలను వ్యాపారులు పెడచెవున పెట్టడం పై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ధరలు నియంత్రించడంలో అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతుందని వినియోగదారులు వాపోతున్నారు. దీపావళి పండగ వచ్చిందంటే చిన్నారులు బాణాసంచా కాల్చేందుకు ఎంతగానో ఇష్టపడతారు. దీపావళి పండుగ సెలవులు మూడు రోజులు ఇవ్వడంతో ఎంతో ఉత్సాహంగా తల్లిదండ్రులు కొన్ని ఇస్తారని ఆశగా ఎదురుచూస్తారు. చిన్నారులకు టపాసులు కొనిస్తామని తల్లిదండ్రులు శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన దుకాణాల వద్దకు వెళ్లి ధరలు చూసి బెంబేలెత్తుతున్నారు. గతంలో పోల్చుకుంటే ఈ ఏడాది ధరలు సామాన్యుడు కొనలేని విధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత ధరలు ఎందుకు అమ్ముతున్నారని ప్రజల ప్రశ్నిస్తే తాత్కాలిక లైసెన్సులు తెచ్చుకునేందుకు ఒక్కో అంగడికి వేల రూపాయలు కుమ్మరించామని వ్యాపారులు బహిరంగంగా చెబు తున్నారు. టపాసుల అమ్మకాలలో ప్రతి ఏటా భారీ మొత్తంలో వ్యాపారులకు ఆదాయం వస్తూ ఉండడంతో కొందరు మాఫియాగా ఏర్పడి వ్యాపారంతో సంబంధం లేని వారు సైతం టపాసుల దుకాణాలు నిర్వహిం చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఏది ఏమైనా ధరలు నియంత్రించడంలో అధికా రులు సంబంధిత యంత్రాగం వైఫల్యం చెందారని ప్రజలు చర్చించుకుంటున్నారు.