మూత్రపిండాలు(కిడ్నీలు) శరీరంలోని ముఖ్యమైన అవయవాలు. కిడ్నీలు రక్తాన్ని శుద్ధి చేయడం, వ్యర్థ పదార్థాలను తొలగించడంతో పాటు శరీరంలోని ఫ్లూయిడ్స్, ఎలక్ట్రోలైట్‌లు, యాసిడ్-బేస్ బ్యాలెన్స్‌ను నియంత్రిస్తాయి. ఎండోక్రైన్ ఫంక్షన్ల ద్వారా ఇవి హిమోగ్లోబిన్ స్థాయిని, ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇన్ని రకాల పనులు చేసే మూత్రపిండాల ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. వేసవిలో హైడ్రేషన్ ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని టిప్స్ పాటిస్తే కిడ్నీలు హెల్తీగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం..!
సాధారణ శారీరక శ్రమ, నడక, పరుగు, సైక్లింగ్, డ్యాన్స్ వంటివి ఆరోగ్యానికి మంచిది. రక్తపోటును తగ్గించడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో ఇవి కీలకంగా ఉంటాయి. ఈ రెండూ మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడు కోడంలో, క్రానిక్ ప్రమాదాన్ని తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.
- క్రమం తప్పకుండా నీరు తాగడం వల్ల హైడ్రేట్‌గా ఉంటారు. ఆరుబయట, వేసవిలో పని చేస్తున్నట్లయితే ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. శరీరం నుంచి అదనపు సోడియం, వ్యర్థ పదార్థాలను తొలగించడానికి నీరు మూత్రపిండాలకు సహాయపడుతుంది. కనీసం రోజుకు 8 గ్లాసుల నీరు తాగాలి.
- ఊబకాయం ఉన్న వ్యక్తులు గుండె, మూత్రపిండాల వ్యాధులతో సహా ఇతర వ్యాధులకు కూడా గురయ్యే ప్రమాదం ఉంది. సోడియం, ప్రాసెస్ చేసిన ఆహారం, రెడ్ మీట్ తక్కువగా ఉండే ఆహారం మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఆహారంలో తృణధాన్యాలతో పాటు తాజా పండ్లు, కూరగాయలు తప్పనిసరిగా ఉండాలి.
- అధిక రక్తపోటు మూత్రపిండాలకు నష్టాన్ని కలిగిస్తుంది. రక్తపోటు స్థిరంగా 140/90ఎంఎం హెచ్‌జీ కంటే ఎక్కువగా ఉంటే రక్తపోటు ఉన్నట్లే. ఉప్పు తీసుకోవడం తగ్గించడంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి మందులు అవసరమైతే వైద్యుడిని సంప్రదించండి.
- డయాబెటిక్ పేషెంట్లకు బ్లడ్ సుగర్స్ అదుపు తప్పితే కిడ్నీ పాడయ్యే అవకాశం ఉంది. రక్తాన్ని ఫిల్టర్ చేయడానికి అదనంగా కష్టపడాల్సి వస్తుంది. సంవత్సరాల తరబడి కొనసాగితే మూత్రపిండాలు కోలుకోలేని నష్టానికి గురవుతాయి. షుగర్‌లను అదుపులో ఉంచుకుని, ఆ పరిధిలో ఉంచుకుంటే కిడ్నీలు పాడయ్యే ప్రమాదం తగ్గుతుంది.
- ఇబుప్రోఫెన్, నాప్రోక్సెన్, మెఫెనామిక్ యాసిడ్, డిక్లోఫెనాక్, అసెక్లోఫెనాక్ వంటి చీూA×ణల (నాన్‌స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్) తరగతికి చెందిన పెయిన్ కిల్లర్‌లకు దూరంగా ఉండాలి. ఈ మందులు క్రమం తప్పకుండా తీసుకుంటే మూత్రపిండాలు దెబ్బతింటాయి.
- పొగాకు రక్తనాళాలను దెబ్బతీస్తుంది, అథెరోస్క్లెరోసిస్‌కు దారితీస్తుంది. మూత్ర పిండాల ద్వారా రక్త ప్రసరణను తగ్గించడానికి కారణమవుతుంది. మూత్రపిండాల వ్యాధి ప్రమాదం పెరుగుతుంది.