ప్రజాశక్తి - ముసునూరు
ముసునూరు ఎంపిడిఒగా జి.రాణిగా సోమవారం బాధ్యతలు చేపట్టారు. నూజివీడు ఎంపిడిఒగా పనిచేసిన రాణి బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఇప్పటివరకూ ఇక్కడ ఇన్‌ఛార్జి ఎంపిడిఒగా బాధ్యతలు చేపట్టిన ఇఒపిఆర్‌డి అత్యుత సత్యనారాయణ యథాస్థానానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపిడిఒ మాట్లాడుతూ మండలంలోని 16 గ్రామాల పంచాయతీ కార్యదర్శులు సిఎం జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాల లబ్ధిని అర్హులందరికీ అందేలా చూడాలన్నారు. ఆయుష్మాన్‌భవన పథకంపై క్షేత్రస్థాయిలో పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎఒ కూచిపూడి సాయిరామ్ పాల్గొన్నారు.










