Apr 18,2023 16:29

మంటలు ఆర్పుతున్న గ్రామస్తులు

ముసలమడుగులో  పశుగ్రాసం దగ్ధం
ప్రజాశక్తి - కొత్తపల్లి

     మండలంలోని ముసలమడుగు గ్రామంలో పశుగ్రాసం దగ్ధమైంది. గ్రామస్తుల వివరాల మేరకు ముసలమడుగు గ్రామము లో ఉన్న ముస్లిం కాలనీలో ఉన్న షఫీ ఉల్లా అనే వ్యక్తి పశువుల కోసం పశుగ్రాసం కళ్ళంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మంగళవారం గుర్తుతెలియని వ్యక్తులు పశుగ్రాసానికి నిప్పు పెట్టడంతో పశుగ్రాసం దగ్ధమైంది. గమనించిన గ్రామస్తులు వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం చేరవేసి గ్రామస్తుల సహకారంతో మంటలను అదుపు చేశారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను పూర్తిగా ఆర్పీ వేయడం జరిగింది. ఆ రైతుకు సుమారు 50 వేలవరకు నష్టం వాటిల్లిందని గ్రామస్తులు తెలిపారు. ఎండ తీవ్రత భారీగా ఉన్నందున సోమవారం ఎదురుపాడు గ్రామంలో మంగళవారం ముసలమడుగు గ్రామంలో పశుగ్రాసాలు దగ్ధం కావడంతో పలు గ్రామాల్లో ఉన్న రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. అలాగే మరికొన్ని గ్రామాల్లో ఉన్న  గుడిసె దారులు భయాందోళనకు గురికావలసిన పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనప్పటికీ ఎండాకాలంలో విపరీతమైన ఎండలకు రైతన్నలు పూరి గుడిసెలలో నివాసం ఉంటున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు చర్చించుకుంటున్నారు.