ప్రజాశక్తి - ఆదోని
ముస్లిం పర్సనల్ లా, ముస్లింల ఆచారాలను దెబ్బ తీసేందుకే కేంద్ర ప్రభుత్వం యూనిఫామ్ సివిల్ కోడ్ (యుసిసి) చట్టం ప్రవేశ పెట్టబోతోందని ముస్లిం, మైనారిటీ మత పెద్దలు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ఆదోని ఖాజి అల్తాఫ్ హుస్సేన్ ఇంటి నుంచి నిరసన ప్రారంభించారు. ఆదోనిలో ఉన్న మసీదుల ఇమాంలు, ముఖ్య నేతలతో అల్తాఫ్ హుస్సేన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం యుసిసి చట్టాన్ని ప్రవేశపెట్టేందుకు సమాయత్తం అవుతోందని తెలిపారు. జూన్ 14 నుంచి జులై 14 వరకు కేంద్ర ప్రభుత్వం, లా కమిషన్ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టిందని వివరించారు. యుసిసికి తాము ఎందుకు వ్యతిరేకమో కేంద్ర ప్రభుత్వానికి, లా కమిషన్‌కు పోస్టుల ద్వారా, ఈమెయిల్ ద్వారా వినతులు తెలిపే ఉద్యమానికి శ్రీకారం చుట్టామన్నారు. చట్టంతో తాము తీవ్రంగా నష్టపోతామని తెలిపారు.
వినతి పత్రాలను చూపుతున్న మత పెద్దలు










