Jul 03,2023 17:16

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి

ముస్లింల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం- ఎమ్మెల్యే కాటసాని
 ప్రజాశక్తి - బనగానపల్లె

    ముస్లింల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి నివాసంలో   ముస్లిం సోదరులతో కలిసి పట్టణంలోని పలు అభివృద్ధి, సమస్యలపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ముస్లిం లకు షాది ఖానా ఏర్పాటు గురించి,   ఉర్దూ భవన్ అన్యాక్రాంతం కాకుండా వాటి అభివృద్ధి గురించి, షాదిఖానా ఎక్కడ ఏర్పాటు చేయాలి అనే అంశాలపై ఎమ్మెల్యే  కాటసాని రామి రెడ్డి  ముస్లిం సోదరులతో  చర్చించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి  మాట్లాడుతూ షాది ఖానా నూతన గా నిర్మాణం చేపట్టడానికి 1 కోటి 20 లక్షల రూపాయలు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని తెలిపారు . పాత బస్టాండ్ లోని ఉర్దూ భవన్ ప్రాంతంలో షాది ఖానా ఏర్పాటుకు నేను అడ్డుపడుతున్నానని  మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఆరోపణలు నిజం కాదని ,అసలు అక్కడ షాది ఖానా ఏర్పాటుకు నిధులు మంజూరే కాలేదని వాటి మీద చర్చకు ఎక్కడైనా సిద్ధమని చెప్పారు. కేవలం ముస్లింలు ఓట్ల కోసమే 2019 ఫిబ్రవరిలో హుటాహుటిన షాది ఖానాకు శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు.  ముస్లిం కమిటీ ద్వారా 30 లక్షల రూపాయల కాంట్రిబ్యూషన్ డబ్బులు చూపించి షాది ఖానా కు నిధులు మంజూరైనట్లు ముస్లింలకు మోసం చేయడం జరిగిందని చెప్పారు. షాది ఖానా కమిటీ ద్వారా 30 లక్షల రూపాయలను మళ్లీ విత్ డ్రా చేసుకున్న బీసీ జనార్దన్ రెడ్డి ముస్లిం సోదరులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పారు. ముస్లిం సోదరుల మీద కేవలం కపట ప్రేమను మాత్రమే చూపించడం జరుగుతుందని నిజమైన కష్టపడే నాయకుడు ఎవరు అని ముస్లింలు గుర్తించుకోవాలని చెప్పారు.తాను మొదటిసారి సారీ ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత బనగానపల్లె పట్టణంలోని ఈద్గా స్థలం అన్యాక్రాంతం కాకుండా  30 లక్షల రూపాయలతో ప్రహరీ గోడ నిర్మించడం జరిగిందన్నారు . రెండవ సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత బనగానపల్లె పట్టణంలో ముస్లింల స్మశాన వాటిక స్థలం అన్యాక్రాంతం కాకుండా 69 లక్షల రూపాయలతో  ప్రహరీ కూడా నిర్మాణం చేపట్టడం జరిగిందని, త్వరలోనే పనులు పూర్తి చేసి ప్రారంభం చేయనున్నట్లు తెలిపారు. అవుకు మెట్ట వద్ద షియా మతస్తులకు చెందిన స్థలంలో 40 లక్షల రూపాయల తన సొంత నిధులతో ఇబాదత్ ఖానా నిర్మాణం చేపట్టడం జరిగిందని, త్వరలోనే ఇబాదత్ ఖాన ను కూడా ప్రారంభోత్సవం చేయడం జరుగుతుందని తెలిపారు.  పట్టణంలో ముస్లింల అభివృద్ధికి పాటుపడిన నాయకుడు ఎవరని ముస్లిం సోదరులు గుర్తుపెట్టుకోవాలని నేను ముస్లింలకు శాశ్వత అభివృద్ధి పనులు చేయడానికి శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పారు. ముస్లింలకు నేను మేలు చేశాననే నమ్మకం మీకు ఉంటే మీరు నన్ను మళ్ళీ 2024 ఎన్నికల్లో ఆశీర్వదించాలని కోరారు.  ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శివరామయ్య, షేక్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ అబ్దుల్ ఖైర్, వైసిపి మైనార్టీ నాయకులు అబ్దుల్ ఫైజ్, అత్తార్ జాహీద్ హుస్సేన్ ,డాక్టర్ మహ్మద్ హుస్సేన్, సైకిల్ షాప్ మహబూబ్ వలి, ఖాన్ రైస్ మిల్లు యజమాని ఇర్ఫాన్, జమాతే ఇస్లామిక్ సభ్యులు షబ్బీర్ హుస్సేన్, అరాఫత్, కూరగాయల రెహ్మాన్, పట్టణ ముస్లిం సోదరులు పాల్గొన్నారు.