Oct 25,2022 23:08

ముస్లిం వెల్ఫేర్‌ జెఎసి సభ్యులు

ప్రజాశక్తి -పిఎం పాలెం : వెనుకబడిన ప్రాంతాల్లో ముస్లిముల అభివృద్ధి కోసం విశాఖ ముస్లిం వెల్ఫేర్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ పేరుతో సంఘాన్ని ఏర్పాటుచేశామని మధురవాడకు చెందిన ముస్లిం పెద్దలు తెలిపారు. 6వార్డు పరిధి పిఎం పాలెం మసీదులో జరిగిన జమాత్‌ ఈ కార్యక్రమంలో పిఎం పాలెం, సాగర్‌ నగర్‌, బక్కన్నపాలెం, సుజాతనగర్‌, మారికవలస తదితర ప్రాంతాల నుంచి వచ్చిన ముస్లిం పెద్దల సమక్షంలో కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. అధ్యక్షునిగా ఎఆర్‌.షరీఫ్‌, ఉపాధ్యక్షునిగా మొహిద్దిన్‌, కార్యదర్శిగా ఇంతియాజ్‌ ఖాన్‌, కార్యనిర్వహణ కార్యదర్శిగా షరీఫ్‌, కోశాధికారిగా మొహమ్మద్‌ జవహర్‌ హుస్సేన్‌తో సహ మరి కొంతమందిని ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముస్లిం కమిటీ శ్రేయస్సు కోసం పాటుపడతామని, ప్రభుత్వం ద్వారా వస్తున్న పథకాల ప్రయోజనాలను అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.