ముస్లిం మైనార్టీల అభ్యున్నతి టిడిపితోనే సాధ్యంరాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి ఎస్.ఎం.ఫర్వీన్ తాజ్
బి.కొత్తకోట : ముస్లిం మైనార్టీల అభ్యున్నతి టిడిపితోనే సాధ్యమని రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి ఎస్.ఎం.ఫర్వీన్ తాజ్ స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి అంతపురం పార్లమెంటు కార్యాలయంలో ఘర్‌ఘర్ నారా - చంద్ర బాబు హమారా ముస్లిం మైనారిటీల కోసం నూరు బాషా సోదరులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర టిడిపి కార్యని ర్వాహక కార్యదర్శి ఎస్.ఎం.పర్వీన్ తాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వంలో ముస్లిం మైనారిటీలకు ఒరిగిందేమీ లేదని రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ఇచ్చిన ఎమ్మెల్యే పదవులు, ఎమ్మెల్సీలు ప్రభుత్వ సలహాదారులుగా ఇచ్చిన రెండు పదవుల ద్వారా ముస్లిం సమాజానికి ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. వారికి ఇచ్చిన పదవులకు నిధులు, విధులు లేనివి కేవలం అలంకారప్రాయంగా మారిపో యాయని విమర్శించారు. ప్రభుత్వ సలహాదారులుగా ఉన్న వారికి ముఖ్య మంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అపాయింట్మెంట్ కూడా దొరకని దుస్థితిలో ఉన్నా రని ఆమె ఎద్దేవా చేశారు. పూర్తిస్థాయిలో ముస్లిం మైనారిటీలను ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగ పరంగా అణచివేతకు గురి చేశారన్నారు. గత టిడిపి హయంలో అన్నిరంగాలలో ముస్లిం మైనార్టీలు రాణించారని తెలిపారు.










