ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
ముస్లిం, మైనార్టీల రిజర్వేషన్లు తొలగిస్తామనడం బిజెపి అహంకారానికి ప్రతీక అని మాలమహానాడు రాయలసీమ అధ్యక్షులు సి.రంగయ్య మండిపడ్డారు. సోమవారం జిల్లా నాయకులు మల్లేష్, ఎమ్మిగనూరు తాలూకా అధ్యక్షులు ఉసేనప్ప, కార్యనిర్వాహక అధ్యక్షులు మురళీ కృష్ణ అధ్యక్షతన రంగయ్య మాట్లాడారు. ఉన్న రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. దళితులకు, ముస్లింలకు మధ్య దూరం పెంచడానికి ఎన్నికల డ్రామా అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. ముస్లింల రిజర్వేషన్లు తొలగించడం ఎవరి తరం కాదని, అది వారికి అంబేద్కర్ ఇచ్చిన వరమని తెలిపారు. రాబోయే రోజుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కలిసికట్టుగా బిజెపి ప్రభుత్వాన్ని సాగనంపుతారని హెచ్చరించారు. జిల్లా నాయకులు మల్లేష్, అంజినయ్య, శ్రీను, నరసింహా, వీరాంజి, బలరాం, రాము పాల్గొన్నారు.
మాట్లాడుతున్న మాలమహానాడు రాయలసీమ అధ్యక్షులు రంగయ్య










