Oct 28,2023 01:12

ముసాయిదా జాబితా అందచేస్తున్న కలెక్టర్‌

ప్రజాశక్తి-గుంటూరు : స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌-2024కు సంబంధించి రూపొందించిన ముసాయిదా ఓటర్ల జాబితా శుక్రవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. గుర్తింపు పొందిన వివిధ పార్టీల ప్రతినిధులకు ముసాయిదా ప్రతిని కలెక్టర్‌ అందించారు. ముసాయిదా జాబితా ప్రకారం జిల్లాలో 17,37,447 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ముసాయిదాపై అక్టోబర్‌ 27 నుండి డిసెంబర్‌ 9 వ తేది వరకు క్లైయిమ్స్‌, అభ్యంతరాల స్వీకరిస్తామని తెలిపారు. జాబితాను పబ్లిక్‌ డొమైన్‌లో కూడా అందుబాటులో ఉంచామని, ప్రజలు సదరు ముసాయిదా జాబితాలో తమ పేర్లను సరిచూసుకోవాలని కోరారు. సమావేశంలో తెనాలి సబ్‌ కలెక్టర్‌ గీతాంజలిశర్మ, డి.ఆర్‌.ఓ కే.చంద్రశేఖరరావు, ఆమ్‌ఆద్మీ నాయకులు డాక్టర్‌ టి.సేవాకుమార్‌, బిఎస్‌పి నాయకులు సిహెచ్‌.వాసు, బిజెపి నాయకులు ఆర్‌.భాస్కరరావు, కాంగ్రెస్‌ నాయకులు బి.సునీల్‌, సిపియం నాయకులు వై.కృష్ణకాంత్‌, టిడిపి నాయకులు కంచర్ల శివరామయ్య, వైసిపి నాయకులు ఎ.జోసెఫ్‌ కుమార్‌ పాల్గొన్నారు.