Aug 19,2023 21:47

పరిశీలిస్తున్న అధికారులు

పరిశీలిస్తున్న అధికారులు
మురుగునీటి శుద్ధి కేంద్రాలతో డ్రెయిను సమస్యలకు పరిష్కారం
ప్రజాశక్తి-నెల్లూరు:నగర పాలక సంస్థ పరిధిలోని జనార్దన్‌ రెడ్డి కాలనీ, అల్లీపురం ప్రాంతాల్లోని మురుగునీటి శుద్ధి కేంద్రాలతో నగర వ్యాప్తంగా డ్రైనేజీ సమస్యలకు పరిష్కారం లభించనుందని కమిషనర్‌ వికాస్‌ మర్మత్‌ తెలియజేసారు. పబ్లిక్‌ హెల్త్‌, ఎల్‌ , టి, నగర పాలక సంస్థ అధికారులతో కలిసి స్థానిక అల్లీపురం లోని ఎస్‌.టి.పి కేంద్రాన్ని కమిషనర్‌ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ రాష్ట్ర పురపాలక పట్టణాభివద్ధి శాఖా మంత్రి ఆదేశాల మేరకు మురుగునీటి శుద్ధి కేంద్రాలను నడిపించేందుకు అవసరమైన అన్ని సాంకేతిక అంశాలను పరిశీలించి వర్కింగ్‌ కండిషన్‌ లోకి తీసుకొని రానున్నట్లు తెలిపారు.
మురుగునీటి శుద్ధి కేంద్రాల ప్రారంభానికి అవసరమైన ఆర్ధిక వనరులను అందించి అత్యంత వేగవంతంగా సేవలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అనంతరం స్థానిక ఎల్‌ , టి కార్యాలయంలో అధికారులతో కలిసి వివిధ అంశాలను సమీక్షించారు.ఈ కార్యక్రమంలో పబ్లిక్‌ హెల్త్‌ ఎస్‌.ఈ గోపాల్‌ రెడ్డి, ఎల్‌ ,టి అధికారులు, నగర పాలక సంస్థ ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.