తాడేపల్లి రూరల్: ఎంటిఎంసి పరిధిలోని చిర్రావూరు గ్రామంలో మురుగునీరు సమస్యను పరిష్కరించాలని సిపిఎం తాడేపల్లి మండల కార్యదర్శి దొంతి రెడ్డి వెంకట్ రెడ్డి మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారు లను ఆయన డిమాండ్ చేశారు. బుధవారం చిర్రావూరు గ్రామంలో రైతు సంఘం నాయకులతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లా డుతూ గ్రామంలో స్థానిక సమస్యలతో పాటు మురుగు నీరు సమస్య ప్రధానంగా ఉందని అన్నారు. పరిసరా లలో వాడుకున్న వ్యర్ధపు మురుగునీరు బయటకు పోయే దారి లేక పంట కాలవలో వచ్చి చేరుతుం దన్నారు. పంట కాలువలో మురుగు నీరు పొంగి, రోడ్లపైకి వచ్చి చేరుతుందని అన్నారు. మురుగునీరు రోడ్లపై నిల్వ ఉండడం వలన దోమలు అధికంగా ప్రబలి, ప్రజలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని అన్నారు. అదేవిధంగా సాగునీరులో మురుగునీరు కలవడం వలన పంటలు దెబ్బతింటు న్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. పంటలకు తెగుళ్లు వచ్చి, దిగుబడులు తగ్గి రైతుల నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. తక్షణమే గ్రామంలో మురుగినీటి సమస్యను పరిష్కరిం చేందుకు మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు త్వరతగతిన చర్యలు చేపట్టి, డ్రైన్స్ నిర్మా ణం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్య క్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు జొన్న శివ శంకరరావు, సిపిఎం తాడేపల్లి మండల నాయకులు పల్లె కృష్ణ, బత్తుల సంసోను, బొప్పన గోపాలరావు, పల్లపాటి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.










