ప్రజాశక్తి- చీరాల : మురుగునీటి పారుదలకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి తెలిపారు. కుందేలు పేరుకుపోయిన మట్టి, చిలచెట్ల తొలగింపు , అభివృద్ధి పనులను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కుందేరు ఆధునీకరణలో భాగంగా చిల్లచెట్లు, మట్టిని తొలగిస్తున్నట్లు తెలిపారు. డ్రోన్ల సాయంతో కలుపు మొక్కలను తొలగిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి పనులను వేగవంతం చేసి మురుగునీటి పారుదలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వేటపాలెం ఎంపిడిఒ శర్మ, చీరాల మున్పిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బొనిగల జైసన్ బాబు,అర్బన్ ఫైనాన్స్ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు, మున్సిపల్ కౌన్సిలర్లు, వార్డు ఇన్‌ఛార్జులు, డ్రైనేజీ డిఇ సుబ్బారావు,మున్సిపల్ డిఇ ఐసయ్య,ఎలక్ట్రికల్ డిఇ సూర్య ప్రకాష్ రావు, ఆర్‌అండ్‌బి డిఇ నరసింహులు, పంచాయతీ సెక్రెటరీలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.










