Aug 16,2023 23:40

మురుగునీరు తొలిగించాలి
ప్రజాశక్తి-కోట: మురుగునీటిని తొలగించాలని కోట గ్రామంలోని ఆకు తోట దిబ్బ ప్రాంత ప్రజలు, కోట మండల టీడీపీ నాయకులు బుధ వారం కోట పట్టణ అధ్యక్షులు షేక్‌ షంషుద్దీన్‌ ఆధ్వర్యంలో సమ స్యగా మారిన మురుగు కాలువలో బైఠాయించి నిరసనకు దిగారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని పంటకాలువను ఇటీవల పూడ్చటంతో మురుగు నీరు వీధులు, ఇళ్లల్లోకి ప్రవహిస్తోం దని, సత్వరమే పూడికతీత చర్యలు చేపట్టాలని కోట తహశీల్దార్‌, ఎంపీడీఓలకు ఆకుతోట దిబ్బ పరిసర ప్రాంత ప్రజల నుండి సంత కాలు సేకరించి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా వారు పట్టించు కోలేదని వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పం దించి తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. కార్యక్ర మంలో టీడీపీ తిరుపతి జిల్లా బీసీ సెల్‌ కార్యదర్శి తీగల సురేష్‌ బాబు, కోట ఎంపీటీసీలు దారా సురేష్‌, షేక్‌ బాబు, షేక్‌ నౌషాద్‌, బీజేపీ నాయకులు సారంగం రమేష్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.