Aug 28,2023 18:41

మురుగుతో నిండి ఉన్న కాలువ

ప్రజాశక్తి-కందుకూరు :పట్టణంలోని మురుగు కాలవలు మురుగుతో నిండి వున్నాయి. రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ ప్రక్కన ఉన్న మురుగు కాలువ దుస్థితి అద్వానంగా ఉంది. చెత్తాచెదారంతో మురుగు కాలువ నిండి, దోమలకు ఆవాసంగా మారిన పరిస్థితి. అసలే డెంగ్యూ ఉధతం కానున్న నేటి కాలంలో పట్టణంలో మురుగు కాలువలను పూర్తిస్థాయిలో శుభ్రం చేయాలని ప్రజలు మున్సిపాలిటి బాధ్యులను కోరుతున్నారు..