స్థానికులతో మాట్లాడుతున్న కార్పొరేటర్ చిన్ని కుమారి లక్ష్మి
ప్రజాశక్తి -భీమునిపట్నం : ఙవిఎంసి రెండో వార్డు కార్పొరేటర్ గాడు చిన్ని కుమారి లక్ష్మి సోమవారం బ్యాంక్ కాలనీ, మామిడిపాలెం, బోరపేట, రాయిపాలెం తదితర ప్రాంతాల్లో పర్యటించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో డ్రైనేజీ పరిస్థితిని పర్యవేక్షించారు. పలు ప్రాంతాల్లో మురుగునీటి ఇబ్బందులను స్థానికులు అమె దృష్టికి తేగా, పరిష్కారానికి కృషి చేస్తానని హామీనిచ్చారు. రాయిపాలెం ఉన్నత పాఠశాల తరగతి గదుల్లో కొన్ని చోట్ల శ్లాబ్ పౖౖెకప్పు పెచ్చులూడుతున్నట్లు హెచ్‌ఎం రాధాకుమారి దృష్టికి తేగా, దీనిపై ఉన్నతాధికారులతో మాట్లాడతానన్నారు. టిడిపి నేతలు గాడు అప్పలనాయుడు, కోండ్రు కృష్ణ, అప్పల రెడ్డి, ఎర్రయ్య రెడ్డి, శివ పాల్గొన్నారు.










