Sep 02,2023 00:15

ప్రజాశక్తి - భట్టిప్రోలు
స్థానిక ప్రధాన మురుగు కాలువ (బిఎం)ను ఏడాది రూ.30లక్షలతో అభివృద్ధి చేశారు. కానీ ఉన్న పాత కాలువ కట్టలు లోతుగా త్రవ్వడంతో నూతన కట్టలు బలహీనపడి కాలువలోకి జారిపోయాయి. పట్టణ ప్రధాన అక్విడాట్ నుండి అక్కవారిపాలెం వెళ్లే మార్గంలోని వంతెన వరకు ఈ పనులు చేపట్టారు. కానీ పనులలో అవినీతి కారణంగా కాలువ కట్టలు బలహీనపడి జారిపోయాయని రైతుల ఆరోపించారు. ప్రస్తుతం పూర్తిస్థాయిలో వర్షాలు లేకపోవడం వలన జారిన కాలువ కట్టలు అలాగే ఉండిపోయాయి. అధిక వర్షాలు కురిసి ఉంటే ఈపాటికి కట్టలు తెగిపోయి ఉండేవని రైతులు చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం కాలువ కట్టలను గుత్తేదారు మరో మారు మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికైనా బలహీనపడ్డ కట్టలను పూర్తిస్థాయిలో పటిష్టంగా ఉండేవిధంగా పనులు జరిపించాలని రైతులు కోరుచున్నారు.