Jul 27,2023 20:50

చిన్నపాటి వర్షానికి బురదగా మారిన పత్తూరులోని ఓ వీధి

ఖాజీపేట : ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కోట్లాది రూపాయల నిధులను ఖర్చు చేసి మౌ లిక సదుపాయాలు కల్పి స్తున్నా క్షేత్రస్థాయిలో మా త్రం వారి సమస్యలు పరి ష్కారానికి నోచు కోవడం లేదు. గ్రామాల్లో గతంలో వేసిన సిమెంటు రోడ్లు దెబ్బతిని అధ్వానస్థితిలో ఉన్నా ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టిం చుకోవడంలేదని ప్రజలు వాపోతున్నారు. చిన్నపాటి వర్షం వస్తే మురుగు నీరు అంతా వీధుల్లో వచ్చి చేరుతుండడంతో దుర్వాసన వస్తోందని అల్లాడి పోతున్నారు. దోమలు వ్యాప్తి చెందితే వ్యాధులు పొంచి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలోని పత్తూరు గ్రామంలోని వీధులు అధ్వా నంగా మారాయి. వర్షం వస్తే రాకపోకలు సాగించడానికి కష్టతరంగా మా రింది. సిమెంటు రహదారులు దెబ్బతిన్నా కొత్తదారులు ఏర్పాటుకు అధికారు లు చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి వర్షానికే వీ ధుల్లోకి వర్షపు నీరంతా పెద్ద ఎత్తున చేరి రోజుల తరబడి నిల్వ ఉంటోంది. మురుగు బయటికి వెళ్లేందుకు ఆస్కారం కూడా లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పారిశుధ్యంపై ప్రత్యేకదృష్టి సారించి సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలని, వర్షాకాలం ప్రారంభం కావడంతో అంటువ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అధికారులు, ప్రజా ప్రతినిధులను కోరుతున్నారు.
అభివృద్ధికి నోచుకోని పాతపాలెం
ప్రజాశక్తి -చాపాడు ( మైదుకూరు)
మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని పాతపాలెం గ్రామం అభివృద్ధికి దూరంగా ఉంది. గ్రామానికి వెళ్లేందుకు సరైన రహదారి కూడా అందుబాటులో లేదు. దీంతో గ్రామ స్తులు వేరే మార్గా లను ఎంచు కొని ప్రయా ణించాల్సి వ స్తోంది. అలాగే గ్రామం లో సిమెంట్‌ రోడ్లు ఉన్న ప్పటికీ మురుగునీరు రోడ్లపై నిలుస్తూ కంపు కొడుతోంది. చిన్న పాటి వర్షం పడినా వర్షపునీరు రోడ్డుపై నిలిచి దోమలు పెరుగుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. గ్రామంలో సిమెంట్‌ రోడ్లు ఏర్పాటు చేసి డ్రయినేజీ వ్యవస్థను అభి వృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాత పాలెం గ్రామం మైదు కూరు పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అభివృద్ధిలో మాత్రం ఎంతో వెనుకబడి ఉంది. మున్సిపాలిటీ ప్రారంభ ఎన్నికల్లో ఈ వార్డు నుంచి ఏకగ్రీవంగా అభ్యర్థిని ఎన్నుకున్నప్పటికీ అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదని స్థానికులు పేర్కోం టున్నారు. ప్రస్తుతం ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, అధికారులు గ్రామంలో డ్రయినేజీ ఏర్పాటు చేసి గ్రామానికి వెళ్లేందుకు సరైన రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ వార్డు పరిధిలోని మరో గ్రామమైన సర్వాయిపల్లె నుండి మైదుకూరుకి వచ్చేందుకు నేషనల్‌ హైవే కింది భా గాన ఉన్న కల్వర్టులు వర్షపు నీరు నిలుస్తూ గ్రామస్తులు వచ్చేందుకు చాలా ఇబ్బందికరంగా మారింది. గతంలో అనేకసార్లు ప్రజలు మున్సిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.