ముర్రుపాలు పిల్లలకు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి
ప్రజాశక్తి - బనగానపల్లె
మురుపాలు పిల్లలకు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయని జిల్లా ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమ అధికారి, డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ డా.జగదీశ్వర్ రెడ్డి పేర్కొన్నారు బుధవారం మండలంలోని కైప సబ్ సెంటర్ లో టంగుటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డా.శివ శంకరుడు ఆధ్వర్యంలో ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమ అధికారి, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డా.జగదిశ్వర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రజలకు రక్త పోటు,మధుమేహం ,క్యాన్సర్ సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తల పై అవగాహన కల్పించారు. అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తల్లిపాలు పిల్లలకు ఎంతో శ్రేష్టమన్నారు. పిల్లలు పుట్టిన వెంటనే ముర్రుపాలు తాగిస్తే పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. తల్లిపాలు వాటి ఆవశ్యకత గురించి,పాలలో ఉన్నటువంటి పోశకాలు పిల్లలకు వాటి ఉపయోగం గూర్చి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎం.ఎల్. హెచ్. పి .చార్మిల ఏఎన్ఎం.అబిదా, టిబి అధికారి నర్సింహ ఆశా వర్కర్లు, అంగన్వాడి టీచర్లు, ఆయాలు ,సిబ్బంది పాల్గొన్నారు.










