ప్రజాశక్తి -మాధవధార, కంచరపాలెం : జివిఎంసి 50వ వార్డు పరిధి మురళీనగర్‌లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఉత్తర నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త కెకె రాజు, 50వ వార్డు కార్పొరేటర్ వావిలపల్లి ప్రసాద్‌తో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. ప్రజల సమస్యలనడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కెకె.రాజు మాట్లాడుతూ, ప్రజలకు మంచి చేయాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకరరావు, కో-ఆప్షన్ సభ్యులు సేనాపతి అప్పారావు, యాత కార్పొరేషన్ చైర్మన్ పిల్లి సుజాత, వార్డు అధ్యక్షులు నీలి రవి, డైరెక్టర్లు రాయుడు శ్రీను, పైడి శ్రీను, ఎన్.రవికుమార్, ఐ.రవికుమార్, 50వ వార్డు నాయకులు బాగాతి విజరు, కృష్ణారావు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.










