Nov 06,2023 00:35

 సత్తెనపల్లి రూరల్‌: మండలంలోని గుడిపూడికి చెందిన మునగోటి వెంకట్రావు జాతీయ బంగారు నంది అవార్డు అందుకున్నారు. వల్లూరి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో హైదరాబాదులోని రవీంద్రభారతిలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును అందుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సంగీతం, సమాజసేవలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ వార్డును ప్రదానం చేసినట్లు అవార్డు గ్రహీత మునుగోటి వెంకట్రావు తెలిపారు.