ప్రజాశక్తి - అమరావతి : మునుగోడు గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే ఎన్.శంకరరావు అన్నారు. స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం నిర్వహించిన జగనన్న సురక్ష క్యాంప్‌లో ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారుల దృష్టికి 421 సమస్యలు రాగా వాటిని పరిష్కరించినట్లు చెప్పారు. నియోజకవర్గంలో 90 శాతానికి పైగా రోడ్లు పూర్తి చేశామని, అమరావతి - బెల్లంకొండ రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఆస్పత్రుల అభివృద్ధికి రూ.25 కోట్లకు పైగా ఖర్చు చేశామన్నారు. అనంతరం రూ.15 లక్షల వ్యవసాయ పని ముట్లను రైతులకు అందించారు. కార్యక్రమంలో క్రోసూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఈదా సాంబిరెడ్డి, మాజీ చైర్మన్ వి.జ్వాల లక్ష్మీనరసింహారావు, ఎంపిపి ఎం.హనుమంతరావు, సచివాలయాల కన్వీనర్ ఎన్.రాంబాబు, సర్పంచ్ బి.విష్ణు, వైసిపి నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.










