Oct 02,2023 20:50

గాంధీ చిత్రపటం వద్ద ప్రతిజ్ఞ చేస్తున్న మున్సిపల్‌ కార్మికులు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీల అమలుకు గాంధీ స్ఫూర్తితో ఉద్యమిస్తామని మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సిఐటియు) నాయకులు ఎ.జగన్మోహన్‌రెడ్డి అఆన్నరు. ఆ యూనియన్‌ ఆధ్వర్యంలో స్టేడియం పేట వద్ద గాంధీ జయంతిని నిర్వహించారు. ముందుగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. యూనియన్‌ నాయకులు జి. కుమారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి జగన్మోహన్‌ మాట్లాడుతూ అహింస, శాంతి నినాదంతో భిన్నత్వంలో ఏకత్వాన్ని పోరాట ఆయుధంగా మార్చి మహాత్మా గాంధీ ప్రజల్ని జాతీయ ఉద్యమంలో భాగస్వామ్యం చేశారన్నారు. అదే స్ఫూర్తితో పోరాడుతామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కార్మికులు రమ ఈశ్వరమ్మ అప్పయ్యమ్మ, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.