నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు
ప్రజాశక్తి - ఆదోని
మున్సిపల్ ఉపాధ్యాయులకు డివైఇఒ పోస్టులు కేటాయించాలని ఎపి ఎంటిఎఫ్ పట్టణ శాఖ అధ్యక్షులు అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి జంగం బసవరాజు డిమాండ్ చేశారు. బుధవారం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో సీనియర్ నాయకులు దస్తగిరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. మున్సిపల్ ఉపాధ్యాయుల యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ విడుదల చేయాలని, మున్సిపల్ పాఠశాలలకు తగిన సంఖ్యలో పాఠశాల సహాయకులు, ప్రధానోపాధ్యాయుల పోస్టులు మంజూరు చేయాలని కోరారు. మున్సిపల్ పాఠశాలల పర్యవేక్షణకు అర్బన్ లోకల్ బాడీ కింద ఉన్న మున్సిపల్ ఉపాధ్యాయులకు మండల విద్యాశాఖాధికారి-2 మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.










