ప్రజాశక్తి - ఆదోని
బదిలీలు, పదోన్నతులు కల్పించకుండా మున్సిపల్ ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఎపి మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి సురేష్ కుమార్, ఆదోని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అనిల్ కుమార్, జంగం బసవరాజు మండిపడ్డారు. బుధవారం మున్సిపల్ నెహ్రూ మెమోరియల్ హైస్కూల్ ఆవరణలో వారు మాట్లాడారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఉపాధ్యాయులకు అధిక సంఖ్యలో పదోన్నతులు, బదిలీలు జరిగినప్పటికీ మున్సిపల్ ఉపాధ్యాయుల విషయంలో ప్రభుత్వం జాప్యం చేయడం ఏమిటని నిలదీశారు. అనేక మంది మున్సిపల్ ఉపాధ్యాయులు పదోన్నతులు, బదిలీలు పొందకుండానే విరమణ పొందాల్సి వస్తుందేమోననే అభద్రతభావంతో ఉన్నారని తెలిపారు. మున్సిపల్ ఉపాధ్యాయుల సర్వీసు రూల్స్ రూపొందించి, బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని కోరారు. ఇటీవల జరిగిన పని సర్దుబాటు ప్రక్రియను రద్దు చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న నంద్యాల ఎంఇఒపై తగిన చర్యలు తీసుకోవాలని డిఇఒ రంగారెడ్డిని కలిసి కోరినట్లు తెలిపారు. జ్ఞాన మద్దయ్య, బడుగు బసవరాజు, నూరుల్ హక్, చంద్రమౌళి, వెంకటేశ్వర్లు, ఆనంద్ ఉన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు










