Jul 04,2023 20:28

నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు

ప్రజాశక్తి - ఆదోని
పురపాలక ఉపాధ్యాయుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్ష వీడాలని మున్సిపల్‌ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ముజాహిద్దీన్‌ హుస్సేన్‌, సుధాకర్‌ బాబు, సురేష్‌ కుమార్‌, దస్తగిరి తెలిపారు. మంగళవారం నెహ్రూ స్మారక పురపాలక, మున్సిపల్‌ ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు విరామ సమయంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మున్సిపల్‌ ఉపాధ్యాయులకు యూనిఫైడ్‌ సర్వీస్‌ రూల్స్‌ విడుదల చేసి వెంటనే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పోస్టులు మంజూరు చేసి బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని కోరారు. ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉన్న మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లులు మంజూరు చేయాలని తెలిపారు. మున్సిపల్‌ డిడిఒలకు, ఈహెచ్‌ఎస్‌లకు తగిన వెసలుబాటు కల్పించాలని కోరారు. మహేష్‌, నిరంజన్‌, చంద్రశేఖర్‌ శర్మ, చంద్రమౌళి, సుధాకర్‌, నాగరాజు, ఆనంద్‌, జాన్‌ విక్టర్‌ రాజు, రామయ్య, కోటన్న, సునంద, కొండమ్మ, రాధ, పద్మాబాయి, జానకి, అంతుల్‌ రహీమ్‌ జియా పాల్గొన్నారు.