Jul 31,2023 21:58

సమావేశంలో అధికారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే జోగారావు

ప్రజాశక్తి- పార్వతీపురం టౌన్‌ : పార్వతీపురం మున్సిపల్‌ కార్యాలయంలో సోమవారం చైర్‌పర్సన్‌ బోను గౌరీశ్వరి అధ్యక్షతన జరిగిన సాధారణ సమావేశాన్ని తూతూ మంత్రంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రతిపక్ష కౌన్సిల్‌ సభ్యులు హాజరు కాలేదు. ఎమ్మెల్యే అలజంగి జోగారావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా అజెండాలో పొందుపరిచిన 31 అంశాలను మున్సిపల్‌ అధికారి చదివి వినిపిం చారు. అధికార పార్టీ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించి, సమావేశాన్ని వేగంగానే ముగించే శారు. వార్డులలో శానిటేషన్‌, విద్యుత్తు దీపాలు సక్ర మంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్లు కోరగా, చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ రామప్పలనాయుడు తెలిపారు. సమావేశంలో మున్సిపల్‌ వైస్‌చైర్మన్లు కొండపల్లి రుక్మిణి, యిండుపూరు గున్నేశ్వరరావు, ఫ్లోర్‌ లీడర్‌ మంత్రి రవికుమార్‌, ఎఇ ఆనంద్‌, తదితరులు పాల్గొన్నారు.