ప్రజాశక్తి-పెద్దాపురం, కాకినాడ మున్సిపల్ కార్మికులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో ఇచ్చాపురం నుండి బయలుదేరిన జాతా శనివారం పెద్దాపురం చేరుకుంది. ఈ సందర్భంగా మున్సిపల్ సెంటర్లో నిర్వహించిన సభలో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మున్సిపాలిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తానని, కనీస వేతనాలు అమలు చేస్తానని చెప్పారన్నారు. మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులు ఎన్నో అవస్థలు పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జాతా నాయకులు దడాల గోవిందు, శేఖర్, రాజ్యలక్ష్మి, వర్రే గిరిబాబు, శివకోటి అప్పారావు, స్వామి, బాసిన భద్రరావు, రమణ, చేపల శ్రీను, శేఖర్, రాజబాబు పాల్గొన్నారు.
కాకినాడ సినిమా రోడ్డులోని నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నిర్వహించిన సభలో ఉమామహేశ్వరరావు మాట్లాడారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం కార్మికులకు సంఘాలు లేకుండా చేయాలని కార్మికులు బానిసలుగా పడి ఉండాలని నాలుగు లేబర్ కోడ్‌లు తెచ్చిందని విమర్శించారు. కరోనా సమయంలో సుమారు 170 మంది మున్సిపల్ కార్మికులు మరణించగా వారి కుటుంబాలకు ఏ విధమైన ఆర్థిక సహాయం అందలేదని తెలిపారు. ముఖ్యమంత్రి ఆప్కోస్ ఏర్పాటు చేసి ఔట్సోర్సింగ్ ఉద్యోగులను మోసం చేశారని విమర్శించారు. 60 ఏళ్ల తర్వాత ఏ విధమైన రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకుండా ఇంటికి పంపిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అవుట్ సోర్సింగ్ కార్మికులకు బట్టలు సబ్బులు నూనె చెప్పులు వంటి సౌకర్యాలు అందించక పోవడం శోచనీయమన్నారు. ధనాల వెంకట్రావు, గార్లపాటి లక్ష్మి, బంగారు వరలక్ష్మి, తుట్టా నూకరాజు, నాయుడు తదితరులు మాట్లాడుతూ గత ప్రభుత్వం తెచ్చిన జిఒ నెం. 279కు వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించామన్నారు. జీతాల పెంపుదల కూడా సమ్మె తరువాతనే సాధ్యం అయ్యిందన్నారు. అందువల్ల మున్సిపల్ కార్మికులు సంఘటితమై పోరాడాలన్నారు. సిఐటియు జిల్లా అధ్యక్షుడు దువ్వా శేషబాబ్జి మాట్లాడుతూ ఇటీవల ఇతర రాష్ట్రాల్లో కార్మికులు పట్టు వదలని పోరాటాలు చేసి విజయాలు సాధించారని, మున్సిపల్ కార్మికులు కూడా ఆ విధంగా పోరాడాలన్నారు. సిఐటియు నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి మలకా వెంకట రమణ, జిల్లా కౌన్సిల్ సభ్యుడు నక్కెళ్ల శ్రీనివాస్, నగర ఉపాధ్యక్షుడు మేడిశెట్టి వెంకటరమణ, ఎపిఎంఎస్‌ఆర్‌యు. నగర అధ్యక్షుడు ఎంఎ.స్వామి, విద్యార్థి సంఘం నాయకుడు రాజా, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు బంగారు సత్తిబాబు, నాయకుడు జలగడుగుల శ్రీనివాస్, భవిరిశెట్టి గురుమూర్తి, యర్రంశెట్టి నాగబాబు, రెడ్డి శ్రీను, డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు మందపల్లి సూర్య ప్రకాష్, నాయకులు కొల్లి శ్రీనివాస్, చక్రధర్ శ్రీనివాస్, దుర్గా ప్రసాద్, వసాది లోకేష్, పోసయ్య, లక్ష్మీనారాయణ, క్లాప్ డ్రైవర్స్ అధ్యక్షుడు ఎం.శివ శంకర్, నాయకులు టి.గంగాధర్, ఎ.రాము, మరియు మధు, బుజ్జి, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర బందం నాయకులు కాకినాడ మున్సిపల్ సీనియర్ వర్కర్ చెన్న బాబులును కలిసి పరామర్శించి ముమ్మిడివరం వైపు సాగిపోయారు.










