Jun 16,2023 17:56

మునిసిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందచేస్తున్న నాయకులు

మున్సిపల్ పర్మినెంట్ వర్కర్స్ కు ఇంటి స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించాలి
- ఏపీ మున్సిపల్ పర్మనెంట్ వర్కర్స్ యూనియన్
ప్రజాశక్తి - నంద్యాల

       మున్సిపల్ పర్మనెంట్ కార్మికులకు ఇంటి స్థలాలు ఇచ్చి పక్కా ఇల్లు నిర్మించి మున్సిపల్ కాలనీ ఏర్పాటు చేయాలని మున్సిపల్ పర్మినెంట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్ కమిషనర్ రవిచంద్ర రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మాబునిసకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు కె ప్రసాద్ ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి డి శ్రీనివాసులు రైతు సంఘం జిల్లా కో కన్వీనర్ జి సోమన్న మున్సిపల్ పర్మినెంట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు కోటయ్యలు మాట్లాడుతూ గతంలో శిల్పా మోహన్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు మున్సిపల్ పర్మినెంట్ కార్మికులకు 96 మందికి కోటర్స్ ఇచ్చినారన్నారు. మిగతా 58 మందికి ఇవ్వలేదని వారికి ఇప్పటికైనా ఇంటి స్థలాలు ఇవ్వాలని అన్నారు. ఎందుకంటే వారు అద్దె ఇళ్లలో ఉంటూ బాడిగలు కట్టుకోలేక వారి పిల్లలకు సదువులు చెప్పించుకోలేక ఇంటి ఖర్చులతో కుటుంబాన్ని నెట్టుకు రాలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.  మున్సిపల్ కమిషనర్, చైర్పర్సన్  చొరవ తీసుకొని మున్సిపల్ పర్మినెంట్ కార్మికులకు ఇంటి స్థలాలు ఇచ్చి మున్సిపల్ కోటర్స్ ను నిర్మించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ పర్మినెంట్ కార్మికులు హైమావతి, కృపమ్మ, దావీదు,మధర్వలి, వెంకటమ్మ, జోజమ్మ, సరోజమ్మ, నాగ సుబ్బరాయుడు, సుజానమ్మ, సాకే లక్ష్మీదేవి, రమణమ్మ, తదితరులు పాల్గొన్నారు.