ప్రజాశక్తి-కందుకూరు :కందుకూరు మున్సిపాలిటీ మస్టర్ పాయింట్ వద్ద మున్సిపల్ కార్మికుల జనరల్ బాడీసమావేశం గురువారం జరిగింది ఈ సమావేశాన్ని ఉద్దేశించి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు ఎస్‌ఎ గౌస్ మాట్లాడుతూ ఈనెల 21వ తేదీ బైక్ ర్యాలీ, 24వ తేదీ చలో విజయవాడ కార్యక్రమం ఉన్నదన్నారు.మున్సిపాలిటీలో పని చేస్తున్న శానిటరీ, ఇంజనీరింగ్ సెక్షన్ లోని కార్మికులను పర్మినెంట్ చేయాలని , సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సిబ్బంది కార్మికుల సంఖ్యను పెంచాలని, అనారోగ్యంతో ఉన్న కార్మికులు వారి బదులు వారి కుటుంబ సభ్యులను పనిలోకి తీసుకోవాలని ఈనెల 24వ తేదీ చలో విజయవాడ కార్యక్రమం జరుగుతుందని కార్మికులందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయ కులు శేషమ్మ ,ఎద్దు కొండమ్మ, గోట్టేముక్కల రమణమ్మ ఉన్నారు.










