Aug 15,2023 23:20

మున్సిపల్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలి
ప్రజాశక్తి-వెంకటగిరి: మున్సిపల్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని కోరుతూ ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ సిఐటియు ఆధ్వర్యంలో వెంకటగిరి పట్టణంలోని మహాత్మ గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు వడ్డిపల్లి చెంగయ్య మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికుల పర్మినెంట్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు పట్టించుకోకపోవడంతో నిరసన తెలిపారు. కార్యక్రమంలో సిఐటి యు వెంకటగిరి మండల అధ్యక్షులు మంజుల, ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ సిఐటియు పట్టణ కార్యదర్శి ఎస్‌ ప్రసాద్‌, అధ్యక్షులు వెంకటయ్య, మోహన్‌, లక్ష్మీ పాల్గొన్నారు.