Aug 07,2023 21:43

మున్సిపల్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలి

 రాయచోటి టౌన్‌ :మున్సిపాలిటీలలో పని చేస్తున్న కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం పర్మినెంట్‌ చేయాలని సిఐటియు జిల్లాప్రధాన కార్యదర్శి ఎ. రామాంజులు పేర్కొన్నారు. సోమ వారం ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్నమయ్య జిల్లా కలెక్టరేట్‌ ఎదుట జిల్లాలోని రాయచోటి, రాజ ంపేట మున్సిపాలటీలలో పనిచ ేస్తున్న మున్సిపల్‌ వర్కర్స్‌ రెగ్యులర్‌ చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రభుత్వం పర్మినెంట్‌ చేస్తానని ఓట్లు వేయించుకుని అధికా రంలోకి వచ్చిన తర్వాత ఆప్కాస్‌లో చేర్చి చేతులు దులుపుకున్నారని ఆరోపి ంచారు. సుప్రీం తీర్పు ప్రకారం పనికి తగ్గ వేతనం ఇవ్వాలని, కనీసంగా రూ. 26 వేలు ఇవ్వాలని డిమండ్‌ చేశౄరు. కొబ్బరినూనె చెప్పులు, మాస్కులు, గ్లౌజులు ఇవ్వాలన్నారు. ప్రమాద బీమా సౌకర్యంతో పాటు రిటైర్డ్‌ మెంట్‌ బెనిఫిట్‌ సౌకర్యం కల్పించాలని చనిపోయిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని పేర్కొన్నారు. ఇంజినీరింగ్‌ కార్మికులకు స్కిల్‌, సెమీ స్కిల్‌, అన్‌ స్కిల్‌ కింద వేతనాలు చెల్లించాలన్నారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్‌కు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ప్రసాద్‌ లక్ష్మిదేవి, మధు, శిద్దమల్లు జీ.వి రమణ, తిరుపతమ్మ, రమేష్‌, కార్మికులు పాల్గొన్నారు.అన్నమయ్య జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేస్తున్న మున్సిపల్‌ కార్మికులు