
ప్రజాశక్తి-యంత్రాంగం
రాష్ట్రంలోని మున్సిపల్ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్సిపల్ యూనియన్ రాష్ట్ర జాత శుక్రవారం విశాఖ అనకాపల్లి జిల్లాల్లో చేపట్టారు.
అనకాపల్లి:రాష్ట్రంలోని మున్సిపల్ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్సిపల్ యూనియన్ రాష్ట్ర జాత శుక్రవారం అనకాపల్లి చేరుకుంది. ఈ సందర్భంగా జీవీఎంసీ సర్కిల్ కార్యాలయం వద్ద జరిగిన సభలో ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 123 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో దాదాపు 40 వేల మందికి పైగా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బంది, 10వేలకు పైగా సిపిఎస్ ఉద్యోగులు, వెయ్యి మందికి పైగా క్లాప్ డ్రైవర్లు పనిచేస్తున్నారని తెలిపారు. వారిని పర్మినెంట్ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఆప్కాస్ విధానాన్ని తీసుకొచ్చి మరింత బానిసలుగా తయారు చేశారని విమర్శించారు. పారిశుధ్య విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు జీతాలు, హెల్త్ అలవెన్సులు, ఈఎస్‌ఐ, పిఎఫ్ సక్రమంగా రావడం లేదన్నారు. క్లాప్ డ్రైవర్లకు రూ.18,500 ఇవ్వాలని, ఇంజనీరింగ్, మంచినీటి సరఫరా, పార్కుల్లో పనిచేసే కార్మికులకు సెమీ స్కిల్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వెటర్నరీ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ విభాగం కార్మికులకు రిస్క్ అలవెన్స్‌లు అమలు చేయాలన్నారు. ఆప్కాస్ విధానాన్ని రద్దు చేసి 010 పద్దు ద్వారా జీతాలు చెల్లించాలని కోరారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు రుత్తల శంకరరావు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల పోరాటానికి ఎల్లవేళలా సిఐటియు అండగా ఉంటుందని చెప్పారు. ఈ జాతాలో యూనియన్ రాష్ట్ర కోశాధికారి జ్యోతి బసు, నాయకులు టి.నూకరాజు, సత్యనారాయణ, మహేష్, రత్నం, శివ, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎ.బాలకృష్ణ పాల్గొన్నారు.
నర్సీపట్నం టౌన్: రాష్ట్రంలో మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల ప్రచార జాతాలో భాగంగా రెండవ రోజు నర్సీపట్నం చేరుకున్నారు. పాత మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ జాతాకు నాయకత్వం వహిస్తున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, కార్మికులను పర్మినెంట్ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఆప్కాస్ విధానాన్ని తీసుకొచ్చి మరింత బానిసలుగా తయారు చేశారని విమర్శించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఈనెల 20 తర్వాత రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
సిఐటియు జిల్లా అధ్యక్షులు రుత్తల శంకరరావు మాట్లాడుతూ, మున్సిపల్ కార్మికుల పోరాటానికి ఎల్లవేళలా సిఐటియు అండగా ఉంటుందని తెలిపారు. ఈ జాతాలో యూనియన్ రాష్ట్ర కోశాధికారి జ్యోతి బసు, సిఐటియు జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు,కె.ప్రసన్న, ఎపి రైతు సంఘం జిల్లా ఉపాద్యక్షులు సాపిరెడ్డి నారాయణముర్తి, పర్మినెంట్ సంఘం నాయుకులు కోటి, వరలక్ష్మి, కాంట్రాక్ట్, ఔట్ సోర్సీంగ్ నాయకులు బి.శ్రీనివాసరావు, కుపరాల రాజు, నాని, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
హామీలను అమలు చేయాలి..
గాజువాక : పారిశుధ్య కార్మికులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను సిఎం జగన్మోహనరెడ్డి అమలు చేయాలని ఎపి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్త జీపుజాతా శుక్రవారం పాతగాజువాక జంక్షన్‌కు వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్టు మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేస్తానని, క్లాప్ డ్రైవర్లకు రూ.18,500 వేతనం చెల్లింపు, ఇంజినీరింగ్ కార్మికులకు స్కిల్డ్ వేతనాల చెల్లింపు, హెల్త్ రిస్క్ అలవెన్స్ చెల్లింపు, అర్హులైన వారసులకు ఉద్యోగావకాశం వంటి సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు. జాతాలో సిఐటియుగాజువాక జోన్ కమిటీ నాయకులు ఎం.రాంబాబు, గొలగాని అప్పారావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ, నక్క నాగరాజు, వర్కింగ్ సెక్రెటరీ, గణేష్, గొలగాని కుంచమ్మ, ఐద్వా నాయకురాలు, జి మని,లిరాష్ట రాష్ట్ర కోశాధికారి జ్యోతి బసు, ధనాల వెంకట్రావు, లక్ష్మి, రమాదేవి, గౌరవ అధ్యక్షులు పి.వెంకటరెడ్డి, టి.నూకరాజు, ఉరుకుటి రాజు, జెఆర్ నాయుడు, ఈ.ఆదినారాయణ. పాల్గొన్నారు.
విశాఖ కలెక్టరేట్ : తాను అధికారంలోకి వస్తే ఆరు మాసాలలోనే కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులను, ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానని పాదయాత్ర సమయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని, దానిని తక్షణం అమలు చేయాలని ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. జగదాంబ దరి సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తయి నప్పటికీ కార్మికులకు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం దుర్మార్గమన్నారు. కాంట్రాక్టర్ల జేబులు నింపడం మినహా కార్మికులకు వైసిపి ప్రభుత్వంలో ఒరిగిందేమీ లేదన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలపై మున్ముందు పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిం చారు. సమావేశంలో యూనియన్ రాష్ట్ర కోశాధికారి జ్యోతిబసు, జివిఎంసి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు టి.నూకరాజు, ప్రధాన కార్యదర్శి ఉరుకూటి రాజు, నాయకులు జె.నాయుడు, ఇ.ఆదినారాయణ, గొలగాని అప్పారావు, ఎం.ఈశ్వరరావు, అనిల్, తదితరులు పాల్గొన్నారు.