ప్రజాశక్తి - పుట్టపర్తి అర్బన్ : మున్సిపాలిటీ కార్మికులందరికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ యూనియన్ సిఐటియు నాయకులు, కార్మికులు పుట్టపర్తి మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. మంగళవారం కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్. వెంకటేష్, యూనియన్ జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఇంజనీరింగ్ కార్మికులకు హెల్త్ అలవెన్స్ లు ఇవ్వాలని, జీవో 30 ని సవరించి వేతనాలు ఇవ్వాలని కోరారు.కరోనా సమయంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఈనెల 7న కలెక్టరేట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నాయకులు రామయ్య, గోవిందు, పెద్దన్న, నరసింహులు, నాగార్జున, వెంకటేశు, సాయి, వెంకటలక్ష్మి, అనితమ్మ, ఇంజనీరింగ్ కార్మికుల సంఘం నాయకులు రమేష్, గణేష్, రాందాస్, పోతులయ్య, నాగభూషణ తదితరులు పాల్గొన్నారు.
హిందూపురం : మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించక పోతే జిల్లా కలెక్టరేట్, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాలను ముట్టడిస్తామని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి జగదీష్ హెచ్చరించారు. మున్సిపల్ వర్కర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు రీలే దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు సిఐటియు పట్టన కార్యదర్శి నరసింహప్ప సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతు మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల మేరకుకార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించక పోతే ఈనెల 7వ తేదీన సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నాను చేపడుతామన్నారు. అప్పటికి ప్రభుత్వం స్పందించక పోతే ముఖ్యమంత్రి క్యాంపు కార్యలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులుతో పాటు కోశాధికారి ఆనంద్, రామచంద్ర, రామంజప్ప, మంజునాథ్, గుర్నాథ్, చంద్ర, నరసింహమూర్తి, శివ కుమార్, శంకర, నాగేంద్ర, బాబయ్య, బాలాజీ, కవిత, ఓబులమ్మ, క్లాప్ డ్రవర్లు అనిల్ తదితరులు పాల్గొన్నారు.
ఎఐటియుసి ఆధ్వర్యంలో ... మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తు మంగళవారం ఎఐటియుసి ఆద్వర్యంలో మున్సిపల్ కార్మికులు ఊరితాళ్లతో ఇందిరా పార్కు నుంచి ర్యాలీ చేపట్టి అంబేద్కర్ సర్కిల్‌లో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముత్యాలప్ప, ఈరప్ప, చలపతి, జబివుల్లా, ఫక్రుద్దీన్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
కదిరి టౌన్ : మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆసంఘం ఆధ్వర్యంలో మంగళవారం కదిరి మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మునిసిపల్ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. మున్సిపల్ కార్మికులకు హెల్త్ రిస్క్ అలవెన్స్ చెల్లించాలని, క్లాప్ డ్రైవర్లకి రూ. 18500 ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు జనార్ధన, తిరుపాలు, బాలకృష్ణ, రాజు, సూరి, రామాంజులు, నరసింహ మూర్తి, రామాంజనేయులు, చెన్నకృష్ణ, రాజేష్, చంద్రప్ప, లక్ష్మన్న, సుమతి, సిఐటియు నాయకులు జి.ఎల్. నరసింహులు, జగన్మోహన్, ముస్తాక్, ఆంజనేయులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు బాబ్జాన్ తదితరులు పాల్గొన్నారు.
మడకశిర రూరల్ : మున్సిపల్ కార్మికుల ప్రధాన సమస్యలను పరిష్కరించాలని సిఐటియు డివిజన్ కార్యదర్శి రామాంజనేయులు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయాన్ని సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ముట్టడించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి సిపిఐ తాలూకా ఇన్‌ఛార్జి పవిత్ర మద్దతు పలికారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సిఐటియు డివిజన్ కార్యదర్శి రామాంజనేయులు తాలూకా సిపిఐ ఇన్‌ఛార్జి పవిత్ర మాట్లాడుతూ మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికుల యూనియన్ నాయకులు బాలకృష్ణ, ఎల్లమ్మ, పార్వతమ్మ, అన్నపూర్ణ, శ్రీనాథ్, నాగరాజు, కార్మికులు పాల్గొన్నారు.
ధర్మవరం టౌన్ : మున్సిపల్‌కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని రైతుసంఘం జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి పెద్దన్న, మున్సిపల్ ఎంప్లాయిస్‌ఆండ్ వర్కర్స్ యునియన్ రాష్ట్ర అధ్యక్షులు నాగభూషణం హెచ్చరించారు. ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయ ప్రధాన గేటును మూసివేసి అక్కడే బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీల్లో దళారి వ్యవస్థను రద్దుచేయాలన్నారు. కార్మికులకు ఆస్కాస్ నుండి తొలగించి 010 పద్దతి ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 7న జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. అప్పటికి ప్రభుత్వం దిగిరాకపోతే చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు ఎల్‌ఆదినారాయణ, కార్యదర్శి అయూబ్ ఖాన్, సిపిఎం పట్టణ కార్యదర్శి నామాలనాగార్జున, డీవైఎఫ్‌్‌ఐ బాలాజీ, షెక్షావలి, అనంతపురం నగర మున్సిపాలిటీ కార్మికసంఘం అధ్యక్షుడు ఎర్రిస్వామి, ధర్మవరం మున్సిపల్ కార్మికసంఘం అధ్యక్ష, కార్యదర్శులు బాబు, చెన్నకేశవులు, గౌరవాధ్యక్షులు పుల్లన్న, కార్మికులు పాల్గొన్నారు.










