Aug 01,2023 17:11

ఆందోళన నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికులు

మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి
సంక్షేమ పథకాలు అమలు చేయాలి : సిఐటియు
ప్రజాశక్తి - ఆత్మకురు

     ఆత్మకూరు  మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం, సంక్షేమ పథకాలు, ఇంజనీరింగ్ కార్మికులకు రిస్క్ హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని సిఐటియు పట్టణ కార్యదర్శి రామ్ నాయక్, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు నాగన్న, గొడుగురాజు, ప్రసాద్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు స్వాములు  అన్నారు. మంగళవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కరించాలని ధర్నా నిర్వహించి మేనేజర్ కు  వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని 123 కార్పోరేషన్స్ మున్సిపాలిటీలు నగర పంచాయతీలో దాదాపు 40 వేల మంది పైగా కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారన్నారు.  రాష్ట్ర జనాభాలో 40 శాతంగా ఉన్న పట్టణ ప్రజలకు పారిశుధ్యం, త్రాగునీరు, వీధిలైట్లు, రోడ్లు, పార్కులు, పౌర సేవలు అందిస్తున్నారన్నారు. కరోనా కష్టకాలంలో కోవిడ్ వారియర్స్ గా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవ చేశారన్నారన్నారు. మున్సిపల్ కార్మికులకు పెండింగ్లో ఉన్న పీఎఫ్, వెంటనే చెల్లించాలన్నారు.  వీరికి 010 పద్ధతి ద్వారా జీతాలు చెల్లింపు, సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగాల పర్మినెంట్, సంక్షేమ పథకాలు, సిపిఎస్ రద్దు  చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు సద్దాం, మున్సిపల్ కార్మికులు  దానమయ్య, వినోద్, రవి, నాగన్న, రామకృష్ణ, రాజేంద్ర, శిఖమని, స్వాములు, జయన్న,  సుశీలమ్మ, జీవరత్నమ్మ, సువరణమ్మ, సామక్క, రూతమ్మ, తదితరులు పాల్గొన్నారు.